Site icon HashtagU Telugu

Mr. Bachchan : ట్రోలర్‌కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన హరీష్ శంకర్

Harish Replay

Harish Replay

సోషల్ మీడియా (Social Media) పుణ్యమా అని ఇటీవల ట్రోల్స్ ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సినిమా వల్ల ఫై ట్రోల్స్ (Trolls) వేస్తూ వ్యూస్ పెంచుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ట్రోల్స్ అనేవి సరదాగా ఉండాలి కానీ అవతలి వ్యక్తిని అగౌవరపరిచే విధంగా ఉండకూడదు..కానీ అవేమి పట్టించుకోకుండా హీరోయిన్ల ఫై , సినిమా తాలూకా సీన్లు, కథలు, సాంగ్స్ ఇలా ఏదైనా సరే ఆలా విడుదల కాగానే వెంటనే వాటిపై ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. తాజాగా మిస్టర్ బచ్చన్ (Mr. Bachchan) హీరో రవితేజ (Raviteja) ఫై కూడా ఇలాగే ట్రోల్స్ చేయడం తో డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) సదరు ట్రోలర్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు.

షాక్, మిరపకాయ్ సినిమాలు తరువాత హరీష్ శంకర్ – రవితేజ కలయికలో ‘మిస్టర్ బచ్చన్’ అనే మూవీ తెరకెక్కుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రం బాలీవుడ్ హిట్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా వస్తుంది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన ఈ సినిమా.. 1980లో జరిగిన ఓ ఇన్కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా రూపొందుంది. బాలీవుడ్ లో సూపర్ హిట్టైన ఈ చిత్రం.. ఇప్పుడు టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఈ సినిమా తాలూకా ఫస్ట్ సాంగ్ సితార ను నిన్న మేకర్స్ రిలీజ్ చేసారు.

We’re now on WhatsApp. Click to Join.

రచయిత సాహితి అంధించిన లిరిక్స్ కు మిక్కీ జేఏసీ మేయర్ మ్యూజిక్ అలాగే సాకేత్, సమీరా గానం అందించారు. ఈ సాంగ్ లో రవితేజ, భాగ్యశ్రీ మధ్యలో ఉన్న కాంబినేషన్ బాగుందని, రొమాంటిక్ మెలోడీ లో వారు వేసిన స్టెప్పులు మ్యూజిక్ కు తగ్గట్టుగా ఉన్నాయని చాలామంది కితాబు ఇస్తున్నారు. ఓ ట్రోలర్ మాత్రం ”25 ఏళ్ళ భాగ్య శ్రీ బోర్సేతో 56 ఏళ్ల రవితేజ డ్యాన్స్ స్టెప్స్ వేస్తున్నాడు. కనీసం ఆ హీరోయిన్ ఫేస్ చూపించాలని కూడా ఫిల్మ్ మేకర్ (దర్శకుడు హరీష్ శంకర్)కి అనిపించలేదు. ఎందుకు అంటే… ఆ అమ్మాయి బాడీని చూపించాలని మాత్రమే అనుకున్నారు. ఆబ్జక్టిఫై చేశారు. తెలుగు సినిమాల్లో ఇది కామన్” అని ట్వీట్ చేశాడు.

దీనికి హరీష్ దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు. ”మీరు డిస్కవరీ చేసిన విషయానికి కంగ్రాట్స్. మీరు నోబెల్ ప్రైజ్ కి అప్లై చేయాలి. మిమ్మల్ని స్వాగతిస్తున్నా. మీరు ఈ విధంగా మీ పని కంటిన్యూ చేయండి” అని రిప్లై ఇచ్చారు. ఈ సమాధానము ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. మాములుగా హరీష్ తనపై కానీ తన సినిమాలపై కానీ నెగిటివ్ గా ప్రచారం చేస్తే ఏమాత్రం సహించడు. అవతలి వ్యక్తి ఎంతపెద్దవాడైన సరే తన మనసులో ఉన్నది బయటకు చెప్పేస్తాడు..మీడియా ఫై కూడా పలుసార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన రోజులు ఉన్నాయి.

Read Also : Thiragabadara Saami : రాజ్ తరుణ్ దెబ్బకు తల పట్టుకున్న మల్కాపురం శివకుమార్‌..?