సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ (Venkatesh) తన తదుపరి సినిమా కోసం కథలు వైన్ పనిలో బిజీ గా ఉన్నారు. ఇప్పటివరకు యాభైకి పైగా కథలు విన్నా, ఎవరికీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా ఓ మామూలు హిట్ అయితే ఇంత ఆలస్యం ఉండేది కాదు, కానీ సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం తో వెంకటేష్ బాక్సాఫీస్ స్టామినాను తిరిగి నిరూపించడంతో, తదుపరి ప్రాజెక్ట్‌ను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. వెంకటేష్ 77వ సినిమా దర్శకత్వ బాధ్యతలు హరీష్ శంకర్ (Harish Shankar) తీసుకోనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Chandrababu P4 Scheme : చంద్రబాబు P4 అనే కాన్సెప్ట్ అదుర్స్..కాకపోతే
సమాజవరగమన పాట రచయితల్లో ఒకరైన నందు, కొన్ని నెలల క్రితం వెంకటేష్ కు ఓ హిలేరియస్ ఎంటర్‌టైనర్ కథ చెప్పగా, అది వెంకీతో పాటు సురేష్ బాబుకూ బాగా నచ్చిందట. కథలో మంచి ట్విస్టులు ఉన్నప్పటికీ, నందుకు దర్శక అనుభవం లేకపోవడంతో కేవలం కథ మాత్రమే తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అప్పుడు దర్శకుడిగా ఎవరు వస్తారన్నదానిపై స్పష్టత రాలేదు. అయితే, ఇప్పుడు వినిపిస్తున్న పేరే హరీష్ శంకర్. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినప్పటికీ, హరీష్ శంకర్ స్టోరీ టెల్లింగ్, ఎంటర్టైన్మెంట్ హ్యాండ్లింగ్ పై నమ్మకంతో వెంకటేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
YS Jagan Tweet: పవన్‌పై వైఎస్ జగన్ ఆగ్రహం.. ఎవరి హయాంలో ఆధ్యాత్మిక శోభ విలసిల్లింది?
ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలైనప్పటికీ, 2026 సంక్రాంతి రిలీజ్ టార్గెట్‌గా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ మరికొంత ఆలస్యం కావడంతో హరీష్ శంకర్‌కు ఈ కొత్త సినిమా చేయడానికి తగినంత సమయం ఉందని తెలుస్తోంది. చూద్దాం మరి హరీష్ ఫైనల్ అవుతాడా…? ఒకవేళ ఫైనల్ అయితే వెంకీ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడా అనేది చూడాలి.