Harihara Veeramallu : ఇల్లందు సింగరేణిలో పవన్ కళ్యాణ్ మూవీ షూటింగ్

Harihara Veeramallu : గురువారం చిత్రబృందం సింగరేణి ప్రాంగణంలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. శరవేగంగా సాగిన ఈ షూటింగ్‌ కారణంగా సింగరేణి ప్రాంగణం సందడిగా మారింది

Published By: HashtagU Telugu Desk
hariharaveeramallu yellandu singareni

hariharaveeramallu yellandu singareni

సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఖమ్మం జిల్లాలోని ఇల్లందు సింగరేణి (Yellandu Singareni) జేకే 5 ఓసీలో జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న పాన్-ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. గురువారం చిత్రబృందం సింగరేణి ప్రాంగణంలో పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించింది. శరవేగంగా సాగిన ఈ షూటింగ్‌ కారణంగా సింగరేణి ప్రాంగణం సందడిగా మారింది. ఇల్లందు సింగరేణిలో చిత్రీకరించిన సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు సమాచారం. చిత్ర యూనిట్ సభ్యులు షూటింగ్ సందర్భంగా అక్కడి గనుల్లోని ప్రదేశాలను పరిశీలించి, విభిన్న కోణాల్లో అత్యుత్తమ విజువల్స్‌ను అందించేందుకు కృషి చేయనున్నారు.

UAE President Mohamed: 500 మంది భార‌తీయ‌ ఖైదీలను విడుదల చేసేందుకు UAE ప్రధాని ఆదేశం

సింగరేణి యాజమాన్యం ఈ షూటింగ్‌ను పర్యవేక్షిస్తూ, చిత్రబృందానికి సహకారం అందిస్తుంది. చిత్రీకరణను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటూ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. సినిమా పూర్తయిన తర్వాత ప్రేక్షకులకు వాస్తవికతతో కూడిన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించనున్నట్లు చిత్ర బృందం చెబుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు.

  Last Updated: 28 Mar 2025, 10:08 AM IST