HHVM : యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్న ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్

HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రక సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Hari Hara Veeramallu, Pawan Kalyan Movie

Hari Hara Veeramallu, Pawan Kalyan Movie

HHVM : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న చారిత్రక సినిమా ‘హరిహర వీరమల్లు’ విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తోంది. ఈ నెల 24న థియేటర్లకు రానున్న ఈ చిత్రానికి సంబంధించి విడుదల చేసిన ట్రైలర్‌ విశేష స్పందన తెచ్చుకుంది. గురువారం రిలీజ్ చేసిన ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో కేవలం 24 గంటల్లోనే కోటి కోట్లు తెచ్చుకున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

తెలుగు వెర్షన్ ట్రైలరే 48 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించగా, అన్ని భాషల్లో కలిపి 61.7 మిలియన్ల వ్యూస్ నమోదయ్యాయి. ఇది టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఏ ట్రైలర్‌కి లభించిన అత్యధిక వ్యూస్‌గా నిలిచింది. సినిమాపై ఉన్న అంచనాలను ఇది మరోసారి నిరూపించింది. భవిష్యత్‌లో వచ్చే సినిమాలకు ఇది ఒక బెంచ్‌మార్క్ అవుతుందని, ఇది కేవలం రికార్డు మాత్రమే కాదని చిత్రయూనిట్ స్పష్టం చేసింది.

పవన్ కల్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, అలాగే ప్రముఖ నటుడు సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఏ. దయాకర్ రావు నిర్మించగా, ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పిస్తున్నారు.

ప్రారంభంలో ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహించినా, కొన్ని కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి వైదొలిగారు. దీంతో మిగతా భాగాన్ని దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

Lockup Death : తమిళనాడు లాకప్ డెత్.. పోస్టుమార్టం నివేదికలో సంచలన విషయాలు

  Last Updated: 04 Jul 2025, 02:25 PM IST