Site icon HashtagU Telugu

Pavan Kalyan: పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’

Harihara Veeramallu

Harihara Veeramallu

పాన్ ఇండియా స్టార్ట్ గా పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ అదిరే అప్డేట్ వచ్చేసింది:

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’

బందిపోటు పాత్రలో పవర్ స్టార్ వపన్ కళ్యాణ్

ఢిల్లీలోని చాందినీ చౌక్ సెట్స్ వేస్తున్న మేకర్స్

త్వరలోనే ‘హరిహర వీరమల్లు’కొత్త షెడ్యూల్ షురూ

వ‌ప‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. ఇందులో పవన్ కళ్యాణ్ టైటిల్ పాత్రను పోషిస్తున్నారు. ఇది పీరియాడిక్ మూవీ… మొఘలుల నేపథ్యంలో సాగే కథ. హరిహర వీరమల్లు లో పవర్ స్టార్ ఓ బందిపోటు పాత్ర‌లో క‌నిపించనున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు 70 శాతం సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. కరోనా కారణంగా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ లను దాటి ప్రస్తుత థర్డ్ వేవ్ దశలో త్వ‌ర‌లోనే కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించబోతున్నారు. ఇందుకోసం హైద‌రాబాద్‌లో భారీ సెట్స్ వేస్తున్నారు మేకర్స్. మొఘ‌లుల కాలం నాటి కథ కావడంతో అందుకు తగినట్టుగా అప్పటి కట్టడాలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు ఢిల్లీ వాణిజ్య ప్రాంత‌మైన చాందినీ చౌక్ ప్రాంతాన్ని సెట్స్ రూపంలో హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సిద్ధం చేస్తున్నారు.

మరోవైపు పవ‌న్ క‌ళ్యాణ్ హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ సినిమాల్లో భీమ్లా నాయాక్ మూవీకి సంబంధించి దాదాపు వ‌ర్క్ అంతా కూడా పూర్త‌య్యింది. కొంత ప్యాచ్ వర్క్ మాత్ర‌మే మిగిలి ఉంది. అది పూర్త‌యిన త‌ర్వాత ‘హరిహర వీరమల్లు’పై ప‌వ‌న్ కళ్యాణ్ ఫోకస్ పెట్టనున్నారు. ఇప్ప‌టికే స‌గానికి పైగా సినిమా పూర్తి కావ‌డంతో మిగిలిన భాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసి, ఈ ఏడాది ద్వితీయార్థంలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ ను ప్రత్యేకంగా చూపించాలన్న ఉద్దేశంతో… ప్రతి ఫ్రేమ్ ను ఎంతో శ్రద్దగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు జాగర్లమూడి క్రిష్. ‘హరి హర వీర మల్లు’ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో విడుద‌ల చేసేలా ముందు నుంచి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇందులో బాలీవుడ్‌కి చెందిన న‌టీన‌టుల‌ను న‌టింపచేశారు. ఈ మూవీలో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉన్నారు. ఓ హీరోయిన్ నిధి అగ‌ర్వాల్ కాగా.. మ‌రో హీరోయిన్‌గా న‌ర్గీస్‌ ఫ‌క్రి న‌టంచే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మొఘ‌లు చ‌క్ర‌వ‌ర్తిగా అర్జున్ రాంపాల్ న‌టిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నిర్మాత ఎ.ఎం.ర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన పండగ సాయన్న అనే బందిపోటు పాత్రలో కనిపిస్తున్నారు… పండగ సాయన్నను అప్పటి ప్రజలు రాబిన్ హుడ్‌‌గా భావించేవారు. ఆయన పాత్ర ఆధారంగానే ‘హరిహర వీరమల్లు’ పాత్రను డిజైన్ చేసినట్లు సినీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. పవన్ పక్కన నిధి అగర్వాల్ ఇందులో పంచమి అనే దొంగ పాత్రలో కనిపించనుందట. మరో బాలీవుడ్ హీరోయిన్ నర్గీస్ ఫక్రి.. మొఘలు యువరాణి పాత్రలో మెరవనుందని సమాచారం. ఇక ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. కీరవాణి ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ కు సంగీతం సమకూర్చుతున్నారు.

మ‌రో వైపు భీమ్లా నాయ‌క్ సినిమాను శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 25న విడుద‌ల చేయ‌డానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. సంక్రాంతి పండుగకు మిస్ అయిన భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి షూటింగ్ పూర్త‌యినంత వ‌ర‌కు, దానికి సంబంధించిన పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను కంప్లీట్ చేస్తున్నారు.