HHVM : హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్..ఈసారైనా థియేటర్స్ లోకి వచ్చేనా.?

HHVM : ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్‌తో పాటు టీమ్ ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ని కూడా షేర్ చేసింది. "ఒకరి పోరాటం అధికారం కోసం... మరొకరి పోరాటం ధర్మం కోసం... యుద్ధం మొదలైంది!" ఈ మాటలే సినిమా మూడ్‌ను అద్దం పట్టిస్తున్నాయి

Published By: HashtagU Telugu Desk
Hhvm July 24th

Hhvm July 24th

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన హీరోగా నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు (Harihara Veeramallu) కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా జూలై 24న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపారు.

Bonalu: హైదరాబాద్‌లో జూన్ 26న గోల్కొండ బోనాలు ప్రారంభం

ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ పోస్టర్‌తో పాటు టీమ్ ఒక పవర్‌ఫుల్ డైలాగ్‌ని కూడా షేర్ చేసింది. “ఒకరి పోరాటం అధికారం కోసం… మరొకరి పోరాటం ధర్మం కోసం… యుద్ధం మొదలైంది!” ఈ మాటలే సినిమా మూడ్‌ను అద్దం పట్టిస్తున్నాయి. జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ యోధుడిగా నటిస్తున్నారు. స్టోరి యాక్షన్, చారిత్రక నేపథ్యంతో కూడినదిగా ఉండనుంది.

Yogandhra 2025: విశాఖ సాగరతీరంలో మొదలైన యోగాంధ్ర-2025 వేడుకలు

ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఒక కీలక విలన్ రోల్‌లో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం. రత్నం నిర్మిస్తున్నారు. భారీ విజువల్స్‌, గ్రాఫిక్స్‌ మరియు చారిత్రక నేపథ్యం ఈ సినిమాను ప్రత్యేకతతో నిలిపేలా చూస్తున్నాయి. జూలై 24న సినిమా ప్రేక్షకుల ముందుకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు సినిమా వాయిదా పడడంతో ఈసారైనా రిలీజ్ చేస్తారా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

  Last Updated: 21 Jun 2025, 08:14 AM IST