మెగాస్టార్ చిరంజీవి క్రేజీ ప్రాజెక్ట్ ‘వాల్తేర్ వీరయ్య’. బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సెట్ లోకి ప్రత్యేక అతిథి విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన హరిహర వీరమల్లు చిత్ర దర్శకుడు క్రిష్, నిర్మాత ఏఎమ్ రత్నంతో కలిసి హైదరాబాద్ లోని సెట్స్‌ను సందర్శించారు. బాస్ పార్టీ పాటను చూసి ఆనందించారు పవన్ కళ్యాణ్. దర్శకుడు బాబీ కొల్లి ఈ మెగా మూమెంట్ పై గొప్ప సంతోషాన్ని వ్యక్తం చేశారు. “ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకునే గొప్ప క్షణం. నా మోస్ట్ ఫేవరెట్ పర్సన్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పక్కనే వున్నాను. కళ్యాణ్ గారు బాస్ పార్టీ పాటను చూశారు. కళ్యాణ్ గారికి చాలా నచ్చింది. ఎన్నేళ్ళు గడిచినా అదే ప్రేమ వాత్సల్యం” అని ట్వీట్ చేశారు బాబీ.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కి వెళ్లి పాటను చూస్తున్న ఫోటోలని షేర్ చేశారు దర్శకుడు బాబీ. ఈరోజు విడుదలైన ఈ పాట ప్రోమోకు మంచి ఆదరణ లభించింది. దేవి శ్రీ ప్రసాద్ చేసిన మాస్ నంబర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాస్ పార్టీలో చిరంజీవి సరసన ఊర్వశి రౌతేలా సందడి చేయబోతుంది. నకాష్ అజీజ్, హరిప్రియతో కలిసి డీఎస్పీ పాడిన ఈ పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. డీఎస్పీ పాటకు సాహిత్యం కూడా రాశారు. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించగా, జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా , నిరంజన్ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
A Huge moment to be Cherished forever 🥳
My 2 Most favorite persons Megastar @KChiruTweets garu & Power Star @PawanKalyan garu by my side 🤩Kalyan garu has seen #BossParty song & he loved it.,Such a Positive person with same love even after all these years. ❤️#WaltairVeerayya pic.twitter.com/K2h9Z0JryL
— Bobby (@dirbobby) November 22, 2022