జూన్ నెల మొదలైంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు (Hari Hara Veera Mallu) సినిమా విడుదలకు కేవలం పన్నెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ ఇప్పటికీ ట్రైలర్, ప్రమోషనల్ అప్డేట్లు రావడం లేదు. దీంతో అభిమానుల్లో ఖంగారు ఎక్కువైపోతోంది. ప్యాన్ ఇండియా స్థాయిలో సినిమా బిజినెస్ పుంజుకోవాలంటే కనీసం రెండు వారాల ముందు ట్రైలర్ విడుదల చేయాల్సిన అవసరం ఉంది. అయితే నిర్మాత ఏ.ఎం.రత్నం, దర్శకుడు జ్యోతికృష్ణ బిజీ గా ఉండటంతో, మీడియాలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు. ఫైనల్ కాపీ రెడీ అయిందో లేదో కూడా అర్థం కావడం లేదు.
Tragedy : తిరుపతిలో పెను విషాదం.. హై వోల్టేజ్ రైల్వే విద్యుత్ వైర్లు తగిలి విద్యార్థి మృతి
ఇప్పటివరకు వచ్చిన పాటలు అభిమానులను ఆకట్టుకోలేకపోయాయి. ఆస్కార్ విజేత ఎం.ఎం.కీరవాణి నుండి భారీ అంచనాలున్నప్పటికీ, సంగీతం యావరేజ్‌గా ఉందన్న అభిప్రాయం ఫ్యాన్స్ వ్యక్తం చేస్తుంది. ఈ టైం లో ఓ సాలిడ్ ట్రైలర్ వస్తే తప్ప సినిమా మీద హైప్ పెరగదని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం మేరకు.. సిజి వర్క్ చివరి దశలో ఉందని, తుది కాపీ రెండు రోజుల్లో సిద్ధమయ్యే అవకాశముందని తెలుస్తోంది. ఆ తరవాతే ట్రైలర్‌కు పచ్చజెండా పడే అవకాశం ఉంది. అంటే ట్రైలర్ వచ్చే వారం చివర్లోనే రానుందని అర్ధం అవుతుంది.
ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారుఝామున షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమతులు దాదాపు ఖరారయ్యాయి. అయితే సాధారణ ప్రేక్షకుల్లో అంచనాలు పెరగాలంటే జెట్ స్పీడ్ లో ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలి. గత రెండు నెలలుగా పెద్ద స్టార్ల సినిమా విడుదల కాకపోవడంతో థియేటర్లలో ఒత్తిడి తక్కువగా ఉంది. హరిహర వీరమల్లు సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే, రెండు మూడు వారాల పాటు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించవచ్చని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు. ఇప్పుడు చూస్తే సమయం తక్కువ, పనులు ఎక్కువ..సో ఇప్పటికైనా వీరమల్లు స్పీడ్ చేస్తే బాగుంటుంది.