పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న భారీ హిస్టారికల్ అడ్వెంచర్ చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) విడుదలను ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు శుభవార్త. ఈ నెల 24న సినిమా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుండగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 23వ తేదీన రాత్రి నుంచే ప్రీమియర్ షోల నిర్వహణకు అనుమతి ఇచ్చింది. అంతేకాదు టికెట్ ధరలను కూడా పెంచుకునే అవకాశాన్ని కల్పించింది. దీంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
తెలంగాణలో 23వ తేదీ రాత్రి ప్రీమియర్ షోలకు టికెట్ ధర రూ.600 (జీఎస్టీ అదనం) గా నిర్ణయించబడింది. అంతేకాకుండా జూలై 24 నుంచి 27 వరకు రోజుకు ఐదు షోలు వేసుకునే అవకాశం ఇచ్చింది. ఈ నాలుగు రోజుల పాటు మల్టీ ప్లెక్స్‌లలో టికెట్ ధరను రూ.200 (జీఎస్టీ అదనం), సింగిల్ స్క్రీన్లలో రూ.150 (జీఎస్టీ అదనం)గా పెంచుకునేందుకు అనుమతించింది. అలాగే జూలై 28 నుంచి ఆగస్టు 2 వరకు కూడా ఐదు షోలకు అనుమతి ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, టికెట్ ధరలను మల్టీ ప్లెక్స్‌లలో రూ.150, సింగిల్ స్క్రీన్లలో రూ.106 వరకు పెంచుకునేందుకు వీలు కల్పించింది.
Salman Bhutt : ప్రపంచ కప్, ఒలింపిక్స్‌లో కూడా పాక్‌తో ఆడమని హామీ ఇవ్వాలి
అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రీమియర్ షోలు మరియు టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలి పది రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ టికెట్‌పై రూ.100, అప్పర్ క్లాస్‌పై రూ.150, మల్టీ ప్లెక్స్‌లలో రూ.200 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రీమియర్ షోలకు కూడా 23వ తేదీ రాత్రి నుంచే అనుమతిస్తూ, టికెట్ ధర రూ.600గా నిర్ణయించబడింది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పోలీసులకు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ సినిమా విడుదల నేపథ్యంలో సోషల్ మీడియాలో పవన్ అభిమానులు ఇప్పటికే పోస్టులు పెడుతున్నారు. ట్రైలర్, పాటలు, లుక్స్ ఇలా అన్ని సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాబీ డియోల్, నోరా ఫతేహి, జిషు సేన్ గుప్తా, సత్యరాజ్, రఘుబాబు, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఎఎం రత్నం సమర్పణలో, ఎ.దయాకరరావు నిర్మించిన ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి మరియు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ భారీ హిస్టారికల్ ప్రాజెక్ట్‌పై ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.