Hari Hara Veera Mallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఓ వారియర్ రోల్ లో నటిస్తూ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్న మూవీ ‘హరిహర వీరమల్లు’. 17వ శతాబ్దంలోని మొఘలుల పాలనా కాలంలో పేదల కోసం పోరాడిన వీరమల్లు అనే యోధుడి కథతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని కూడా రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నట్లు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేసారు. అలాగే ఇటీవలే రిలీజ్ చేసిన చిన్న టీజర్ మూవీ పై ఆడియన్స్ కి మంచి ఆసక్తిని కలుగజేసింది.
గత నాలుగేళ్లుగా ఈ సినిమాని చిత్రీకరిస్తూనే వస్తున్నారు. పవన్ పొలిటికల్ బిజీ వల్ల.. అసలు ఈ సినిమా ఎప్పుడు పూర్తి అయ్యి, ఎప్పుడు రిలీజ్ అవుతుందని అనేది కూడా క్లారిటీ లేదు. కానీ ఆడియన్స్ మాత్రం.. రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న సినిమాలు కంటే ఎక్కువ ఆసక్తి ఈ మూవీ పైనే చూపిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘దేవర’ వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. దేవర సినిమా అక్టోబర్ 10న వచ్చేందుకు సిద్ధమైతే.. గేమ్ ఛేంజర్ దివాళీ కానుకగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న మరో యాంటిసిపేటెడ్ మూవీ ‘ఓజి’. ఈ సినిమాని సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ అనౌన్స్ చేసారు. అయితే ఆడియన్స్ ఎన్టీఆర్, చరణ్ సినిమాలు పైనే కాదు, పవన్ నటిస్తున్న ఈ ఓజి పై కూడా ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. ఈ మూడు చిత్రాలు కంటే వీరమల్లుని చూడడానికే ఆడియన్స్ ఎక్కువ ఆసక్తితో ఉన్నారు.
బుక్ మై షో సైట్ లో ‘హరిహర వీరమల్లు’ ఆడియన్స్ నుంచి 97.5K ఆసక్తిని అందుకుంటే.. దేవర-70.2K, ఓజి-50.5K, గేమ్ ఛేంజర్-35.5K ఇంటరెస్ట్ ని అందుకుంది. దీనిబట్టి చూస్తుంటే.. దేవర, ఓజి, గేమ్ ఛేంజర్ సినిమాలు కంటే ‘వీరమల్లు’కే ఆడియన్స్ లో ఎక్కువ క్రేజ్ ఉంది.