Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్

పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu ) టీం క్రేజీ అప్డేట్ ఇచ్చారు. క్రిష్ (Krish) – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలయికలో ‘హరి హర వీర మల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తి అవుతున్న ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు పూర్తి అవ్వడం..రిలీజ్ అవ్వడం జరిగింది కానీ ‘హరి హర వీర […]

Published By: HashtagU Telugu Desk
Hari Hara Veera Mallu

Hari Hara Veera Mallu

పవన్ కళ్యాణ్ అభిమానులకు ‘హరి హర వీర మల్లు’ (Hari Hara Veera Mallu ) టీం క్రేజీ అప్డేట్ ఇచ్చారు. క్రిష్ (Krish) – పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కలయికలో ‘హరి హర వీర మల్లు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రారంభమై దాదాపు మూడేళ్లు పూర్తి అవుతున్న ఇంతవరకు పూర్తి కాలేదు. ఈ సినిమా తర్వాత మొదలుపెట్టిన సినిమాలు పూర్తి అవ్వడం..రిలీజ్ అవ్వడం జరిగింది కానీ ‘హరి హర వీర మల్లు’ మాత్రం అక్కడే ఆగిపోయింది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ గా ఉండడం..పీరియాడికల్ మూవీ కావడం తో ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. అసలు ఈ సినిమా రాదనే అనుకుంటున్నా తరుణంలో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చి సంతోష పెట్టారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రస్తుతం హరిహర వీరమల్లు’ మూవీ హై ఎండ్ వీఎఫ్ఎక్స్ పనులు జరుపుకుంటోందని దీని కోసం ఇరాన్, కెనడా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రదేశాలకు చెందిన అంతర్జాతీయ నిపుణులు ఈ మూవీ గ్రాఫిక్స్ పనుల్లో బిజీగా ఉన్నారంటూ తెలిపారు. అద్భుతమైన గ్రాఫిక్స్ నైపుణ్యానికి అద్దం పట్టేలా, ప్రేక్షకుల ఊహకు అందని రీతిలో పలు సీన్స్​ను గ్రాఫిక్స్​తో రూపొందించి సరికొత్త థ్రిల్ ను అందిస్తామని చిత్రబృందం ప్రకటించింది. అంతే కాకుండా త్వరలోనే స్పెషల్ ప్రోమో తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ అప్డేట్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. పవన్ కల్యాణ్, నిథి శెట్టి లీడ్​ రోల్స్​లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి కీరవాణి మ్యూజిక్ అందిస్తుండగా.. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ నిర్మిస్తోంది.

Read Also : Medigadda Project : రేపు మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు బయలుదేరుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

  Last Updated: 12 Feb 2024, 09:58 PM IST