Rahul Nambiar : హ్యాపీ బర్త్‌డే రాహుల్ నంబియార్.. జాబ్ వదిలేసి సింగర్ అయ్యాడు

ఇవాళ సింగర్ రాహుల్ నంబియార్ 43వ బర్త్ డే. 2001 సంవత్సరంలో సన్ టీవీ నిర్వహించిన ‘సప్త స్వరంగల్’ పోటీలో 3,000 మంది పోటీదారులను ఓడించి రాహుల్ నంబియార్ గెలిచాడు.

  • Written By:
  • Updated On - June 16, 2024 / 10:10 AM IST

Rahul Nambiar : ఇవాళ సింగర్ రాహుల్ నంబియార్ 43వ బర్త్ డే. 2001 సంవత్సరంలో సన్ టీవీ నిర్వహించిన ‘సప్త స్వరంగల్’ పోటీలో 3,000 మంది పోటీదారులను ఓడించి రాహుల్ నంబియార్ గెలిచాడు. ఇప్పటివరకు సినిమాల్లో ఆయన 2000కుపైగా పాటలు పాడారు. ఈసందర్భంగా ఆయన కెరీర్‌తో ముడిపడిన పలు ఆసక్తికర వివరాలను తెలుసుకుందాం..

We’re now on WhatsApp. Click to Join

‘సీతమ్మవాకిట్లో ’…  ‘గురువారం మార్చి ఒకటి’… సాంగ్స్ పాడి రాహుల్ నంబియార్(Rahul Nambiar)  దుమ్ములేపారు. ఈ సాంగ్స్ సినీ, సంగీత ప్రియుల మదిని దోచాయి.  నంబియార్ గానంలో ఆ విధమైన గమ్మత్తు ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే.. కేరళలోని కన్నూర్‌లో నంబియార్‌ జన్మించారు. ఆయనకు బాల్యం నుంచే సంగీతమంటే ప్రాణం. ఎంకామ్, ఎంబీఏ చదివారు. సినిమాల్లో పాటలు పాడే అవకాశం కోసం ఆయన బ్యాంక్ ఉద్యోగాన్నీ వదిలేశారు. గాయకుడిగా నంబియార్‌కు మణి శర్మ తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఆయనకు అవకాశాలు ఇచ్చారు. ‘‘నాకు సంగీతంలో గురువు అంటూ ఎవరూ లేరు. ఎక్కువగా వినడం ద్వారానే సంగీతం నాకు అబ్బింది. కిశోర్ కుమార్, ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏసుదాస్ పాటలంటే ప్రాణం. వాళ్లే నాకు ప్రేరణ’’ అని నంబియార్ చెబుతుంటారు.

Also Read : Sheeps Distribution Scam : రూ.700 కోట్లు ఏమయ్యాయ్ ? గొర్రెల పంపిణీ స్కాంపై ఈడీ ఫోకస్

ప్రస్తుతమున్న పాటల ట్రెండ్ గురించి నంబియార్ స్పందిస్తూ.. ‘‘ఇప్పుడు సినిమా పాటల ట్రెండ్ డిఫరెంట్‌గా ఉంది. మనం కూడా దాన్నే ఫాలో అవ్వాలి. మనకు నచ్చని పాట హిట్ కావచ్చు. దాంట్లో ఉన్న గొప్పతనాన్ని తెలుసుకుని ఫాలో అయితే మంచిది’’ అని చెప్పుకొచ్చారు.  ‘‘పాత పాటలలో గొప్ప మెలోడి ఉంటుంది. సౌండ్, మెలోడి రెండింటి కలయికగా కొత్త పాటలు ఉంటాయి. ఇప్పుడు డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజలకు ఈజీగా పాటలు చేరుతున్నాయి. అయినా ఈకాలంలోనూ పాత పాటలు వినేవాళ్లు చాలామందే ఉన్నారు’’ అని నంబియార్ పేర్కొన్నారు. తనకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడాలని ఉందని నంబియార్ చెబుతుంటారు.మరి ఆయనకు రానున్న రోజుల్లో ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాడే అవకాశం దక్కాలని మనమంతా మనసారా కోరుకుందాం..

Also Read :  New Registration Charges : ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు.. కసరత్తు షురూ