Site icon HashtagU Telugu

Janhvi Kapoor: దేవర నుంచి జాన్వీ కపూర్ న్యూ పోస్టర్ రిలీజ్.. జాన్వీ లుక్ మాములుగా లేదుగా!

Mixcollage 07 Mar 2024 11 26 Am 9850

Mixcollage 07 Mar 2024 11 26 Am 9850

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

ఇది ఇలా ఉంటే ఈ మధ్యకాలంలో తరచూ ఈ సినిమాకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంది. ఆ వార్తలు ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమాలో జాన్వీ కపూర్ మత్స్యకారుని కూతురిగా కనిపిస్తోందని జాన్వీ లుక్ కూడా చాలా వరకూ లంగా ఓణిలో ఉంటుందని టాక్. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ మరోసారి ఆర్ఆర్ఆర్ తర్వాత ట్రైబల్ లుక్‌లో కనిపించనున్నారని, ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు తంగం అని తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి జాన్వీ లుక్‌ను వదలగా ఇక తాజాగా ఈ భామ పుట్టినరోజు సందర్భంగా మరో లుక్‌ను వదిలింది మూవీ టీమ్.

ఈ లుక్ కూడా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్‌తో కలిసి కళ్యాణ్ రామ్ నిర్మిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. కాగా తాజాగా ఈ దేవర నుంచి విడుదల చేసిన జాన్వీ కపూర్ లుక్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఆ లుక్ ఈ సినిమా పై అంచనాలను మరింత పెంచేసింది. జాన్వీ లుక్ మామూలుగా లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇలా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అప్డేట్లను విడుదల చేస్తూ అభిమానులను ఊరూరిస్తున్నారు.

Exit mobile version