Site icon HashtagU Telugu

Hanuman Sequel Jai Hanuman : హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్.. 2025 రిలీజ్..!

Hanuman OTT Release Date Lock Zee 5 Streaming

Hanuman OTT Release Date Lock Zee 5 Streaming

Hanuman Sequel Jai Hanuman అ! నుంచి తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన లేటెస్ట్ మూవీ హనుమాన్ తో మరోసారి తన ప్రతిభ చాటి చెప్పాడు. తేజా సజ్జాతో హనుమాన్ అనే ప్రయోగం చేసిన ప్రశాంత్ వర్మ తన ప్రయత్నం ఎంత గొప్పదో చూపించాడు. సినిమా ఈ సీజన్ రిలీజ్ చేయడం వల్ల ఏమాత్రం తేడా వచ్చినా దారుణంగా ఉంటుందని తెలిసినా సరే ఏమాత్రం బయపడకుండా సంక్రాంతికి స్టార్స్ మధ్య రిలీజ్ చేశాడు హనుమాన్. తేజా సజ్జా, అమృత అయ్యర్ కలిసి నటించిన హనుమాన్ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా నటించింది.

We’re now on WhatsApp : Click to Join

సినిమా కథ, కథనాలే కాదు వి.ఎఫ్.ఎక్స్, మ్యూజిక్ అన్ని విభాగాలు కూడా పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ వల్ల హనుమాన్ కి ఈ యూనానిమస్ హిట్ టాక్ వచ్చింది. ఇక ఈ సినిమా చివర్లో హనుమాన్ సీక్వెల్ ని ప్రకటించి సూపర్ ట్విస్ట్ ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ సీక్వెల్ గా జై హనుమాన్ అంటూ సినిమా ప్రకటించారు. ఈ సినిమా 2025 లో రిలీజ్ అని కూడా చెప్పేశారు. అంటే హనుమాన్ కథ కొనసాగుతుందన్నమాట.

ప్రశాంత్ వర్మ కమిట్మెంట్ ఎలాంటిదో హనుమాన్ సినిమా చూస్తే అర్ధమవుతుంది. సినిమా కోసం ఎంతో కష్టపడిన డైరెక్టర్ అండ్ టీం సినిమాను సక్సెస్ చేయడంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యింది. ఇక జై హనుమాన్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని చెప్పొచ్చు. ఇదేకాదు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇంకా చాలా ఇండియన్ సూపర్ హీరోస్ అది కూడా ఆధ్యాత్మిక కథల్లోని పాత్రలతో సినిమాలు వస్తాయని చెప్పొచ్చు.

హనుమాన్ చూసిన చాలావరకు ఆడియన్స్ ఈ దర్శకుడికి తను అడిగినంత బడ్జెట్ ఇస్తే మరిన్ని అద్భుతాలు చేసే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. తప్పకుండా ప్రశాంత్ వర్మ క్రియేటివ్ యూనివర్స్ లో రానున్న రోజుల్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు చూస్తామని ఆడియన్స్ కూడా బలంగా ఫిక్స్ అయ్యారు.

Also Read : Guntur Karam : గుంటూరు కారం ఆ హీరో రిజెక్ట్ చేశాడా..?

ప్రశాంత్ వర్మ నెక్స్ట్ సినిమాల ప్లానింగ్ కూడా ఆడియన్స్ ని సూపర్ ఎగ్జైట్ అయ్యేలా చేస్తుంది. ఈ సినిమాలకు మాత్రం ప్రశాంత్ వర్మ పెద్ద స్కెచ్ వేసినట్టు ఉన్నాడు.  రానున్న రోజుల్లో టాలీవుడ్ బిగ్గెస్ట్ డైరెక్టర్స్ లో ఒకడిగా ప్రశాంత్ వర్మ సత్తా చాటతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.  హనుమాన్ హిట్ తో అతని టాలెంట్ మరోసారి ప్రూవ్ అయ్యింది కాబట్టి జై హనుమాన్ కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందనడంలో డౌట్ లేదు.