పూరీ జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ (Ismart Shankar) సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఆ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ వస్తుంది. పూరీ జగన్నాథ్ (Puri Jagannath) దర్శక నిర్మాతగా ఊర మాస్ మూవీగా డబుల్ ఇస్మార్ట్ వస్తుంది. రాం కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అంటే దానికి తగినట్టుగానే ఉండేలా ప్లాన్ చేశారట. డబుల్ ఇస్మార్ట్ సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఐతే డబుల్ ఇస్మార్ట్ సినిమా బిజినెస్ విషయంలో అదరగొట్టేస్తుంది. సినిమాను తెలుగు రైట్స్ వరకు హనుమాన్ (Hanuman) మూవీ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనేసినట్టు తెలుస్తుంది. డబుల్ ఇస్మార్ట్ కి ఆయన భారీ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హిందీ వెర్షన్ కాకుండా డబుల్ ఇస్మార్ట్ ని టోటల్ గా 60 కోట్లకు డీల్ ఓకే చేసుకున్నట్టు తెలుస్తుంది.
హిందీలో ఎలాగు భారీగానే లాక్కొచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. డబుల్ ఇస్మార్ట్ సినిమాలో సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు ఆయన విలనిజం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా ఉంటుందని అంటున్నారు. డబుల్ ఇస్మార్ట్ సినిమా విషయంలో మొన్నటిదాకా పెద్దగా బజ్ లేదు కానీ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ అవుతుండటంతో ఫ్యాన్స్ లో హుషారు మొదలైంది.
మరి ఇస్మార్ట్ శంకర్ తరహాలోనే డబుల్ ఇస్మార్ట్ కూడా హిట్ కొడతారా లేదా అన్నది చూడాలి. లైగర్ తర్వాత పూరీ చేస్తున్న సినిమా కాబట్టి డబుల్ ఇస్మార్ట్ కచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఐతే డబుల్ ఇస్మార్ట్ సినిమా సక్సెస్ అయితే రామ్ (Ram) తో మరో సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు పూరీ. సో పూరీకి ఈ సినిమా హిట్ కంపల్సరీ అని చెప్పొచ్చు. పూరీ ఫాం లోకి వస్తే మరిన్ని పాన్ ఇండియా సినిమాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.