Hanuman: ఓటీటీలో హనుమాన్ మూవీ రికార్డ్.. 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ 

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 11:13 PM IST

Hanuman: ఇండియన్ టాప్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ZEE5. అందుకనే ఇప్పుడు ఇండియాలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌తో ZEE5 దూసుకెళ్తోంది. అందుకు కారణం ‘హను-మ్యాన్’. తెలుగువారికే కాదు అన్ని భాషల వారికి వైవిధ్యమైన కథలను అందించడంలో ముందు ఉంటుంది ఓటీటీ ప్లాట్ ఫామ్ ZEE5. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సెన్సేష‌న‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీగా నిలిచిన ‘హను-మ్యాన్’ను మార్చి 17 నుంచి తమ ప్రియమైన ప్రేక్షకుల కోసం స్ట్రీమింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే.

వెర్స‌టైల్ యంగ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో కె.నిరంజ‌న్ రెడ్డి నిర్మాత‌గా ఈ ఏడాది సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ‘హను-మ్యాన్’ చిత్రం ఎవ‌రూ ఊహించ‌ని స‌క్సెస్‌ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్స్‌తో రూ.300కోట్లను సాధించిన ‘హను-మ్యాన్’ తమ జీ 5లో హిస్టరీ క్రియేట్ చేస్తుందని భావించారు. నిజంగా వారి అంచనాలను మించి ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ZEE5 చరిత్రలో తొలి రోజున ఉన్న రికార్డులను తిరగరాసింది.

కేవలం 11 గంటల్లోనే 102 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ సాధించటంతో ఆశ్చర్యపోవటం అందరివంతైంది. అంతే కాదండోయ్..2024లో జీ 5ను ప్రపంచ వ్యాప్తంగా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలబెట్టింది ‘హను-మ్యాన్’. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘హను-మ్యాన్’ను గ్లోబల్ ఆడియెన్స్ ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే చూస్తుండటం విశేషం.