Ayodya – Hanuman : నార్త్ లో ఓ పక్క అయోధ్య ..మరోపక్క హనుమాన్..రెండు రికార్డులే

దేశ వ్యాప్తంగా అంత మాట్లాడుకుంటుంది అయోధ్య రామ మందిర్ (Ayodhya Ram Mandir) గురించే..చిన్న వారి దగ్గరి నుండి పెద్ద వారి వరకు అంత రామస్మరణ తో ఊగిపోతున్నారు. మరికొద్ది గంటల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడబోతుంది. అయోధ్య లో రామ మందిరం అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని కన్నుల వీక్షించేందుకు కోట్లాదిమంది అయోధ్యకు తరలివెళ్తున్నారు. ఇదే క్రమంలో హనుమాన్ (Hanuman) మూవీ సైతం నార్త్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రామ మందిరం […]

Published By: HashtagU Telugu Desk
Ayodya Hanuman

Ayodya Hanuman

దేశ వ్యాప్తంగా అంత మాట్లాడుకుంటుంది అయోధ్య రామ మందిర్ (Ayodhya Ram Mandir) గురించే..చిన్న వారి దగ్గరి నుండి పెద్ద వారి వరకు అంత రామస్మరణ తో ఊగిపోతున్నారు. మరికొద్ది గంటల్లో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఘట్టానికి తెరపడబోతుంది. అయోధ్య లో రామ మందిరం అట్టహాసంగా ప్రారంభం కాబోతుంది. ఈ కార్యక్రమాన్ని కన్నుల వీక్షించేందుకు కోట్లాదిమంది అయోధ్యకు తరలివెళ్తున్నారు. ఇదే క్రమంలో హనుమాన్ (Hanuman) మూవీ సైతం నార్త్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రామ మందిరం ప్రారంభం..హనుమాన్ మూవీ స్టోరీ ..రెండు దగ్గరిదగ్గరిగా ఉండడం తో సినీ ప్రేక్షకులతో పాటు హనుమాన్ భక్తులు ఈ సినిమాను చూసేందుకు పోటీపడుతున్నారు. దీంతో నార్త్ లో థియేటర్స్ ను భారీగా పెంచుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదలై వారం కావొస్తున్నా..ఇంకా అన్ని చోట్ల టికెట్స్ దొరకని పరిస్థితి. దీనిని బట్టి అర్ధం చేసుకోవాలి సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుందో..

We’re now on WhatsApp. Click to Join.

సినిమా మొదలైన దగ్గరి నుండి ఎండ్ అయ్యేవరకు ఎక్కడ కూడా బోర్ కొట్టించకుండా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన విధానానికి యావత్ సినీ ప్రేక్షకులే కాదు..చిత్రసీమ ప్రముఖులు సైతం ఫిదా అవుతూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం అద్భుతంగా ఉందని, విజువల్స్‌ అయితే నెక్ట్స్‌ లెవల్‌ లో ఉన్నాయని అంటున్నారు. మరో వారం రోజుల పాటూ హనుమాన్ హంగామా తగ్గేదేలే అంటున్నారు. ఇక ఓవర్సీస్ లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోలకు సమానంగా కలెక్షన్స్ అందుకుంటూ కళ్ళు చిదేరే రికార్డులు సృష్టిస్తుంది. ఓవరాల్ గా కథలో దమ్ము ఉండాలే కానీ భారీ బడ్జెట్ , భారీ కాస్ట్ & క్రూ అవసరం లేదని హనుమాన్ మూవీ మరోసారి నిరూపించిందని అంటున్నారు. ప్రస్తుతం రూ.150 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ రెండో వారం పూర్తి అయ్యేలోపు ఈజీ గా రూ.200 కోట్లు సాదిస్తుందని ట్రెండ్ పండితులు చెపుతున్నారు.

Read Also : Mohan Babu : చిత్ర పరిశ్రమకు ఏం ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది – మోహన్ బాబు

  Last Updated: 20 Jan 2024, 07:37 PM IST