Site icon HashtagU Telugu

HanuMan: హనుమాన్ మూవీ బంపర్ ఆఫర్, ఒక టికెట్ కొంటే మరొకటి ఫ్రీ

Ayodya Hanuman

Ayodya Hanuman

HanuMan: తేజ సజ్జ హీరోగా తెరకెక్కిన సూపర్ హీరో చిత్రం హనుమాన్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా కలెక్షన్లలో అద్బుతమైన పట్టుతో ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం త్వరలో 200 కోట్ల గ్రాస్‌ను దాటనుంది. అయోధ్యలో రామమందిర శంకుస్థాపన కార్యక్రమం జరుగుతున్నందున రేపు చాలా దివ్యమైనది.

ఈ శుభ సందర్బంగా మల్టీప్లెక్స్ చైన్ మిరాజ్ సినిమాస్ సినీ ప్రియులకు సాలిడ్ ఆఫర్ ప్రకటించింది. నియమాలు, షరతులకు లోబడి రేపటి కోసం ఎంపిక చేసిన ప్రదేశాలలో మల్టీప్లెక్స్ లో హనుమాన్ కోసం “ఒకటి కొనండి, ఒక ఉచిత టికెట్ పొందండి” ఆఫర్ ప్రారంభించబడింది. ఈ నిర్ణయం వల్ల మరిన్ని లాభాలు మరియు ఆదాయాలు వచ్చే అవకాశం ఉంది.

హనుమాన్‌లో వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, అమృత అయ్యర్, వెన్నెల కిషోర్, రాజ్ దీపక్ శెట్టి, సత్య మరియు గెటప్ శ్రీను కూడా ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గౌర హరి స్వరాలు సమకూర్చారు.