Site icon HashtagU Telugu

Hanuman Collections : పుష్ప రికార్డ్స్ తో పోటీ పడుతున్న హనుమాన్

Hanuman Collections

Hanuman Collections

కథలో దమ్ముండాలే కానీ క్యాస్ట్ క్రూ తో సంబంధం లేదని మరోసారి హనుమాన్ (Hanuman ) మూవీ రుజువు చేసింది. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కలయికలో సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ చిన్న మూవీ..ఇప్పుడు పెద్ద మూవీస్ సైతం పక్కకు పెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. కథనే నమ్ముకున్న మేకర్స్..ఎలాగైనా మూవీ విజయం సాదిస్తుందని, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని తీసుకొస్తుందని మేకర్స్ ముందు నుండి చెపుతూ వచ్చారు. వారు చెప్పినట్లే ఇప్పుడు హనుమాన్ ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రథంపడుతున్నారు. సంక్రాంతి బరిలో మహేష్ గుంటూరు కారం , వెంకటేష్ సైన్ధవ్, నాగ్ నా సామిరంగా మూవీస్ తో వచ్చినప్పటికీ అవేవి కూడా ప్రేక్షకులను అలరించలేకపోయాయి. దీంతో అంత హనుమాన్ మూవీ కే పరుగులు తీస్తున్నారు. దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రికార్డ్స్ వైపు పరుగులు పెడుతుంది.

తాజాగా ఈ మూవీ కలెక్షన్లకు సంబంధించి బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్, సినీ క్రిటిక్ అయిన తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. హనుమాన్ మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్ పరిశీలిస్తే కేజిఎఫ్ మొదటి పార్ట్ అలాగే కాంతార వసూళ్ల కంటే ఎక్కువగా ఉన్నాయని దాదాపు పుష్ప సినిమాతో సమానంగా ఈ సినిమా నార్త్ లో వసూళ్లు రాబడుతోందంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు హనుమాన్ సినిమా 2024వ సంవత్సరానికి మొదటి హిట్ గా నిలిచిందని ఓపెనింగ్ వీకెండ్ అద్భుతంగా ఉండడంతో రాబోతున్న రోజుల్లో కూడా వసూళ్లు భారీగా నమోదు అయ్యే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే ఈ మూవీ హిందీ వసూళ్ల వివరాలు చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు రెండు కోట్ల 15 లక్షలు, శనివారం నాలుగు కోట్ల ఐదు లక్షలు, ఆదివారం ఆరు కోట్ల ఆరు లక్షలు కలిపి మొత్తం హిందీలో ఇప్పటివరకు 12 కోట్ల 26 లక్షల దాకా వసూలు చేసినట్లు వెల్లడించారు. ఇది కేవలం హిందీ వర్షన్ మాత్రమే అని , ఇక నార్త్ ఇండియాలో రిలీజ్ అయిన తెలుగు వెర్షన్ కి శుక్రవారం 24 లక్షలు, శనివారం 40 లక్షల, ఆదివారం 45 లక్షలు, మొత్తం కలిపి కోటి 9 లక్షల రూపాయలు వసూలు అయిందని వెల్లడించారు. జనవరి 25వ తేదీ వరకు సాలిడ్ రిలీజ్ ఏదీ లేకపోవడంతో పాటు మాస్ సర్కిల్స్లో హనుమాన్ సినిమాకి వస్తున్న పాజిటివ్ మౌత్ టాక్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Read Also : Mega Pic : సంక్రాంతి మెగా పిక్ అదిరింది..

Exit mobile version