Teja Sajja: మంచి సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారనేదానికి హను-మాన్ నిదర్శనం

Teja Sajja: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల్లో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హీరో తేజ మీడియాతో మాట్లాడారు. దర్శకుడు, నిర్మాత నమ్మకం చూసి నేను మరో చిత్రం కమిట్ అవ్వలేదు. ఈ మధ్యలో ఏదైనా చిత్రం చేస్తే దాని ప్రభావం ఎంతో కొంత హనుమాన్ పై పడే అవకాశం వుంది. అలాంటి అవకాశం […]

Published By: HashtagU Telugu Desk
Hanuman Hero not Accepting Advances here is the Reason

Hanuman Hero not Accepting Advances here is the Reason

Teja Sajja: తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన హనుమాన్ మూవీ హిట్ టాక్ తెచ్చుకొని దూసుకుపోతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ మూవీ అన్ని ఏరియాల్లో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హీరో తేజ మీడియాతో మాట్లాడారు. దర్శకుడు, నిర్మాత నమ్మకం చూసి నేను మరో చిత్రం కమిట్ అవ్వలేదు. ఈ మధ్యలో ఏదైనా చిత్రం చేస్తే దాని ప్రభావం ఎంతో కొంత హనుమాన్ పై పడే అవకాశం వుంది. అలాంటి అవకాశం లేకుండా బలంగా నమ్మి హనుమాన్ చేశాను. ప్రేక్షకులతో కలసి ప్రిమియర్స్ చూశాను. వారి అద్భుతమైన స్పందన చూసి నా బరువంతా దిగిపోయినట్లు అనిపించింది.

అన్నిచోట్ల నుంచి ఎక్స్ ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులంతా చాలా గొప్ప ఆదరిస్తున్నారు. బయట భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సర్ ప్రైజింగా వుంది. నేను ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం వుంది. కానీ ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలీదు. ఇలాంటి వారి నుంచి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇంత ఎక్స్ ట్రార్డినరీ ఓపెనింగ్స్, నెంబర్స్ చూస్తుంటే చాలా ఆనందంగా వుంది. ఈ విజయం ప్రేక్షకులందరిది. అందరూ గొప్పగా ఆదరించారు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరధం పడతారనేదానికి హను-మాన్ నిదర్శనం.

ఇప్పుడు థియేటర్స్ ప్రతి ఆటకి పెరుగుతున్నాయి. ఇది తప్పకుండా నాలుగు వారాలు పైగా రన్ వుండే చిత్రమని ముందే బలంగా నమ్మాం. ఈ వారం చూడని మరో వారం ఖచ్చితంగా చూస్తారని భావించాం.  నాకు అనిపించిందంటే ప్రేక్షకుడికి కూడా అనిపించే అవకాశం వుంది కదా. దర్శకుడు ప్రశాంత్ వర్మ గారు ఇన్ పుట్ ఎవరు చెప్పినా వింటారు. అది ఆయన గొప్పదనం. హనుమాన్ కి అందరం ఒక టీం వర్క్ గా పని చేశాం. చిరంజీవి గారికి హనుమాన్ ప్రాజెక్ట్ గురించి తెలుసు. మా ఉద్దేశం కూడా చిరంజీవి గారికి తెలుసు. హనుమాన్ విషయంలో చిరంజీవి గారు చాలా ఆనందంగా వున్నారు.

  Last Updated: 13 Jan 2024, 09:43 PM IST