Site icon HashtagU Telugu

Hanuman : హనుమాన్ హిట్ టాక్ తో ఆ డైరెక్టర్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!

Hanuman Hit Netizen Trolling On Adipurush Director Om Raut

Hanuman Hit Netizen Trolling On Adipurush Director Om Raut

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజా సజ్జా లీడ్ రోల్ లో తెరకెక్కించిన హనుమాన్ (Hanuman) సినిమా సంక్రాంతి కానుకగా రిలీజైంది. ఈ సినిమాను కావాలని పండుగకి రిలీజ్ చేశారు. స్టార్ సినిమాల మధ్య భారీ రిస్క్ చేస్తున్నామని తెలిసినా సరే ప్రశాంత్ వర్మ తన సినిమా మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమా రిలీజ్ చేశారు. పోటీగా సూపర్ స్టార్ గుంటూరు కారం ఉన్నా సరే ఏమాత్రం డౌట్ పడకుండా హనుమాన్ ని వదిలారు. అయితే విచిత్రం ఏంటంటే మహేష్ గుంటూరు కారం కి డివైడ్ టాక్ వస్తే హనుమాన్ సినిమాకు హిట్ టాక్ వచ్చింది.

We’re now on WhatsApp : Click to Join

ఇది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ముందే ఊహించాడా లేదా తన స్క్రిప్ట్ మీద ఉన్న కాన్ఫిడెంట్ తో అలా వచ్చాడా అన్నది తెలియదు కానీ హనుమాన్ హిట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ఇండస్ట్రీ అంతా స్పెషల్ గా చెప్పుకుంటుంది. హనుమాన్ సినిమా హిట్ అవ్వడంతో గుంటూరు కారం డైరెక్టర్ త్రివిక్రం కి కన్నా మరో డైరెక్టర్ పై ట్రోల్స్ పడుతున్నాయి. అతనెవరో కాదు ప్రభాస్ తో ఆదిపురుష్ చేసిన బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్.

ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమా చేసిన ఓం రౌత్ ఆ సినిమాను ఎలా తీశాడో అందరికీ తెలిసిందే. అదేదో యానిమేటెడ్ మూవీలా చేసి సినిమాను డిజాస్టర్ అయ్యేలా చేశాడు. ఆదిపురుష్ బడ్జెట్ తో పోల్చితే హనుమాన్ చాలా చిన్న బడ్జెట్ కానీ క్వాలిటీ.. కంటెంట్ ఇవి రెండు ఈ సినిమాలో అద్భుతంగా కుదిరాయి. అందుకే ఆడియన్స్ ఈ సినిమాకు ఓటు వేస్తున్నారు. హనుమాన్ హిట్ టాక్ రాగానే ఓం రౌత్ ప్రశాంత్ వర్మని చూసి నేర్చుకో అని ట్విట్టర్లో ట్రోల్స్ మొదలయ్యాయి.

ప్రశాంత్ వర్మ ఇచ్చిన బడ్జెట్ లో బెస్ట్ క్వాలిటీ సినిమా చూపించాడని చెప్పుకుంటున్నారు. తగినంత బడ్జెట్ ఇస్తే ప్రశాంత్ వర్మ అద్భుతాలు చేస్తాడని కొనియాడుతున్నారు. హనుమాన్ మీద తను పెట్టుకున్న నమ్మకాన్ని ఆడియన్స్ నిజం చేశారు. ఈ కాన్ఫిడెన్స్ తన తర్వాత సినిమాలకు కూడా కొనసాగితే మాత్రం ప్రశాంత్ వర్మ తెలుగు సినిమా స్థాయిని పెంచే మరో గొప్ప దర్శకుడు అవుతాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

Also Read : Mahesh Babu : మహేష్ ఎందుకు తగ్గాడో.. గురూజీ ఏం మాయ చేశాడో..!

హనుమాన్ లానే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో ఇంకా చాలా సినిమాలు వస్తాయని అంటున్నారు. కచ్చితంగా రాజమౌళి తర్వాత తెలుగు సినిమా పేరుని ఇంటర్నేషనల్ లెవెల్ లో క్రేజ్ తెచ్చుకునేలా ప్రశాంత్ వర్మ కృషి చేస్తున్నాడని చెప్పొచ్చు.