Site icon HashtagU Telugu

Hanuman : ప్రభాస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన తేజ..బుడ్డోడే కానీ గట్టి హిట్టే కొట్టాడు

Hanuman Collections

Hanuman Collections

దేశ వ్యాప్తంగా ఇప్పుడు రెండే పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి..అయోధ్య రామయ్య పేరు ఒకటైతే..హనుమాన్ (Hanuman) మూవీ పేరు మరోటి. ఈ నెల 22 న అయోధ్య లో రామ మందిరం ప్రారంభం కానుండడం తో దేశ వ్యాప్తంగా ప్రజలు రామయ్యను తలచుకుంటుంటే..ఇటు సినీ ప్రేక్షకులతో పాటు హనుమాన్ భక్తులంతా హనుమాన్ మూవీ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ కలయికలో తెరకెక్కిన హనుమాన్ మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 12 న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. కథలో దమ్ము ఉండాలే కానీ భారీ కాస్ట్ & క్రూ , భారీ బడ్జెట్ అవసరం లేదని హనుమాన్ మూవీ నిరూపించింది.

We’re now on WhatsApp. Click to Join.

సంక్రాంతి బరిలో అగ్ర హీరోలు మహేష్ బాబు , వెంకటేష్ , నాగార్జున వంటి స్టార్ హీరోల చిత్రాలు వచ్చినప్పటికీ..ఏ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. కానీ హనుమాన్ మూవీ మాత్రం అందరి అంచనాలు తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తాజాగా ప్రభాస్ నటించిన సలార్ మూవీ రికార్డ్స్ ను బ్రేక్ చేసి ఆశ్చర్య పరిచింది. హనుమాన్ మూవీ నాలుగో రోజు సోమవారం తెలుగు రాష్ట్రాల్లో రూ.11 కోట్ల కలెక్షన్స్ రాబట్టగా.. ఓవర్సీస్ లో ఏకంగా రూ. 24 కోట్లు రాబట్టి..ఓవరాల్ గా రూ.97 కోట్ల గ్రాస్ సాధించి సలార్ రికార్డ్ బ్రేక్ చేసింది.

ఇప్పటివరకు హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.100 కోట్లు వసూలు చేసినట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు. ‘రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి ‘ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. అటు హనుమాన్ కు హిందీలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఉత్తరాదిలో ఇప్పటివరకు రూ.16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అటు అమెరికాలోనూ హనుమాన్ సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికే 3 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.

Read Also : Mahesh Babu : మహేష్ లో ఈ టాలెంట్ కూడానా.. బాబోయ్ బాబు మామూలోడు కాదండోయ్..!