Hanuman : 92 ఏళ్ల తెలుగు సినిమా రికార్డు ను బ్రేక్ చేసిన హనుమాన్

కథలో దమ్ముండాలే కానీ అది చిన్న చిత్రమా..పెద్ద చిత్రమా..అగ్ర హీరో నటించాడా..చిన్న హీరో నటించాడా అనేది ప్రేక్షకులు చూడరని మరోసారి హనుమాన్ (Hanuman ) మూవీ నిరూపించింది. ట్రైలర్ తోనే ఆసక్తి రేపిన హనుమాన్..విడుదల తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమా విడుదలై దాదాపు నెల రోజులకు దగ్గర అవుతున్నప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ తో రన్ అవుతుందంటే ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన […]

Published By: HashtagU Telugu Desk
Hanuman Record

Hanuman Record

కథలో దమ్ముండాలే కానీ అది చిన్న చిత్రమా..పెద్ద చిత్రమా..అగ్ర హీరో నటించాడా..చిన్న హీరో నటించాడా అనేది ప్రేక్షకులు చూడరని మరోసారి హనుమాన్ (Hanuman ) మూవీ నిరూపించింది. ట్రైలర్ తోనే ఆసక్తి రేపిన హనుమాన్..విడుదల తర్వాత అందరి అంచనాలను తలకిందులు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. సినిమా విడుదలై దాదాపు నెల రోజులకు దగ్గర అవుతున్నప్పటికీ ఇంకా హౌస్ ఫుల్ తో రన్ అవుతుందంటే ఈ సినిమా ఎంతగా ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ మూవీ 92 ఏళ్ల తెలుగు సినిమా రికార్డు (A record of 92 years of Telugu cinema
) ను బ్రేక్ చేసి వార్తల్లో నిలిచింది.

We’re now on WhatsApp. Click to Join.

తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు. ఈ మూవీ ఇప్పటీకే వరల్డ్ వైడ్ గా రూ.275 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రూ.300 కోట్ల క్లబ్‌లోకి దూసుకుపోతుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ హనుమాన్ ఓ అరుదైన రికార్డు సాధించినట్లు తెలిపి సినీ లవర్స్ కు సంతోషం నింపారు. 92 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ‘ఆల్​ టైమ్ సంక్రాంతి బ్లాక్​బస్టర్’​గా ‘హనుమాన్‌’ చరిత్ర సృష్టించినట్లు నిర్మాణ సంస్థ ప్రైమ్​షో ఎంటర్​టైన్​మెంట్ అధికారికంగా ట్విట్టర్​లో షేర్​ చేసింది.

ఇదిలా ఉంటె ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో ఈ సినిమా సీక్వెల్ ‘జై హనుమాన్‌’ సినిమా రానుంది. ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read Also : YCP 6th List : వైసీపీ ఆరో జాబితా విడుదల..ఎవరెవరికి పదవులు దక్కాయంటే..!!

  Last Updated: 02 Feb 2024, 09:36 PM IST