IIFA awards 2024: ఉత్తమ నటుడిగా హనుమాన్

IIFA awards 2024: తేజాకు 2024 ఐఫా అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డు లభించబోతోంది

Published By: HashtagU Telugu Desk
Teja Sajja

Teja Sajja

హనుమాన్ (Hanuman) ఫేమ్ తేజ సజ్జా (Teja Sajja) కు ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. తేజ సజ్జా అంటే చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండుముసలాడి వరకు తెలుసు. చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో అవార్డ్స్ అందుకున్న తేజ..జాంబిరెడ్డి సినిమాతో హీరోగా మారి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ మధ్యనే హనుమాన్ మూవీ నేషనల్ వైడ్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకొని శభాష్ అనిపించుకున్నాడు.

తేజ సజ్జా (Teja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prashanth Varma) తెరకెక్కించిన రియల్ సూపర్ హీరో మూవీనే ‘హనుమాన్’. ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేయగా.. వరలక్ష్మి శరత్‌కుమార్ సహా పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు సంగీతాన్ని సమకూర్చారు. కేవలం 40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలకు లాభాల పంట పండించింది. దాదాపు రూ.250 కోట్ల గ్రాస్‌ను సాధించి అబ్బురపరచింది. ఇక థియేటర్‌లో దుమ్ము దులిపేసిన ఈ చిత్రం ఓటీటీలో కూడా దుమ్ము లేపింది.

ఇక ఇప్పుడు ఏకంగా ఇన్నోవేటివ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు (Innovative International Film Festival Award) ను సైతం దక్కించుకుంది. తేజాకు 2024 ఐఫా అవార్డ్స్ లో భాగంగా ఉత్తమ నటుడు క్యాటగిరీలో అవార్డు లభించబోతోంది. ఈ అవార్డు రాబోతున్న విషయం తెలిసి హనుమాన్ టీమ్ తో పాటు సినీ ప్రముఖులు , అభిమానులు తేజ కు విషెష్ అందిస్తున్నారు. ప్రస్తుతం మరో ప్రాజెక్టుతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం.

Read Also : Pawan Kalyan: జనం ఏమన్నా పిచ్చోళ్లా పవన్…నీకంటే ఊసరవెల్లే బెటర్..!

  Last Updated: 07 Oct 2024, 08:17 PM IST