Hanuman : OTTలో 8 నిమిషాల కత్తిరింపుతో హనుమాన్.. రీజన్ ఏంటంటే..?

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ (Hanuman) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం రోజు హిందీ వెర్షన్ జియో సినిమాస్ లో రిలీజ్ కాగా ఆదివారం తెలుగు వెర్షన్ జీ 5

  • Written By:
  • Publish Date - March 18, 2024 / 08:34 AM IST

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హనుమాన్ (Hanuman) సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. శనివారం రోజు హిందీ వెర్షన్ జియో సినిమాస్ లో రిలీజ్ కాగా ఆదివారం తెలుగు వెర్షన్ జీ 5 వారు హడావిడిగా రిలీజ్ చేశారు. ఎంతోమంది ఆడియన్స్ ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తుంటే ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సినిమా తెలుగు వెర్షన్ ని ఓటీటీ రిలీజ్ చేశారు.

అంతేకాదు హిందీ వెర్షన్ 2 గంటల 38 నిమిషాల రన్ టైం ఉంటే తెలుగు వెర్షన్ కేవలం 2 గంటల 30 నిమిషాలు మాత్రమే ఉంది. తెలుగు వెర్షన్ లో ఏదో ఎపిసోడ్ మిస్ అయ్యిందని ఆడియన్స్ అంతా కూడా కంగారు పడ్డారు. కానీ అసలు విషయం ఏంటంటే తెలుగు వెర్షన్ లో కూడా ఎలాంటి ఎపిసోడ్ మిస్ అవ్వలేదు కానీ ఫ్రేమ్స్ తేడాల వల్ల డ్యురేషన్ కాస్త తగ్గినట్టు తెలుస్తుంది.

ఫ్రేమ్స్ రేటు కోత వల్ల తెలుగు వెర్షన్ లో 8 మినిట్స్ దాకా రన్ టైం తేడా వచ్చింది. అంతేకానీ తెలుగులో ఏ ఎపిసోడ్ మిస్ అవ్వలేదని తెలుస్తుంది. జనవరి 12న రిలీజైన హనుమాన్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ సినిమా 100 ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో సరికొత్త రికార్డులను సృష్టించింది.

హనుమాన్ OTT రిలీజ్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఈగర్ గా ఎదురుచూశారు. 66 రోజుల వారి నిరీక్షణ ఆదివారంతో ముగిసింది. సినిమా ఓటీటీలో ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా అందరు సండే రోజు చూసేందుకు సిద్ధమయ్యారు. తప్పకుండా ఓటీటీలో కూడా హనుమాన్ బీభత్సం సృష్టించేలా ఉంది.