Hanuman 200 Crores తేజా సజ్జ, ప్రశాంత్ వర్మ ఇద్దరు కలిసి చేస్తున్న హనుమాన్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడు పెద్దగా బజ్ లేదు. కానీ ఎప్పుడైతే టీజర్ వదిలారో ఆ టైం లో సినిమాపై సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఇక ట్రైలర్ తో లిమిటెడ్ బడ్జెట్ తో మంచి విజువల్స్ ఉన్నాయని ఫీల్ అయ్యారు. ఇక సినిమా రిలీజ్ అయ్యాక చూసిన వాళ్లంతా కూడా వారెవా అనేశారు. హనుమాన్ చూసిన వారంతా ప్రశాంత్ వర్మ టాలెంట్ గురించి మాట్లాడుతున్నారు.
We’re now on WhatsApp : Click to Join
సంక్రాంతి సందర్భంగా జనవరి 12న రిలీజైన హనుమాన్ సినిమా ఓ విధంగా తీవ్రమైన పోటీలో వచ్చిందని చెప్పొచ్చు. తెలుగులో తక్కువ థియేటర్స్ లో రిలీజైన హనుమాన్ నార్త్ లో భారీ రిలీజ్ చేశారు. సినిమా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకోగా వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది.
ఫైనల్ గా 10 రోజుల్లో హనుమాన్ (Hanuman) సినిమా 200 కోట్ల వసూళ్లతో అదరగొట్టేసింది. కేవలం 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఈ రేంజ్ వసూళ్లు తెస్తుందని ఎవరు ఊహించి ఉండరు. అదేకాదు ప్రస్తుతం అయోధ్య రామమందిరం నిర్మాణం బాల రాముడి విగ్రహ ప్రతిష్ట టైం లో హనుమాన్ సినిమాపై ఇంకాస్త క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా కోసం తెగే ప్రతి టికెట్ లో 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించారు.
Also Read : Prashanth Neel : కోలీవుడ్ స్టార్ తో ప్రశాంత్ నీల్ మూవీ.. ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!
అలా ఇప్పటివరకు కోటికి పైగా అయోధ్య రామ మందిరానికి హనుమాన్ టీం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇక సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా కూడా సరైన కంటెంట్ లేకఓతే ఆ సినిమా ఆడదు. అదే కంటెంట్ ఉన్న సినిమాలో స్టార్స్ ఎవరు లేకపోయినా సరే అదరగొట్టేస్తుంది. హనుమాన్ మరోసారి కంటెంట్ ఉన్న సినిమాకు కటౌట్ తో పనిలేదని ప్రూవ్ చేసింది.