Prabhas : తెలంగాణలో జరిగిన ఆ యుద్ధంతో ప్రభాస్, హను రాఘవపూడి సినిమా..

తెలంగాణలో జరిగిన ఆ యుద్ధం బ్యాక్‌డ్రాప్ తో ప్రభాస్ సినిమాని తెరకెక్కించబోతున్న హను రాఘవపూడి. ఇంతకీ ఏంటి ఆ యుద్ధం..?

Published By: HashtagU Telugu Desk
Hanu Raghavapudi Written Prabhas Movie Story With Hyderabad History

Hanu Raghavapudi Written Prabhas Movie Story With Hyderabad History

Prabhas : ప్రభాస్ తన లైనప్ లో అదిరిపోయే ప్రాజెక్ట్స్ ని సెట్ చేస్తూ ఫ్యాన్స్ కి కిక్ ఇస్తూ వస్తున్నారు. ప్రస్తుతం కల్కి వంటి సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న ప్రభాస్.. హారర్ నేపథ్యంతో ‘రాజాసాబ్’, యాక్షన్ థ్రిల్లర్స్ గా సలార్ 2, స్పిరిట్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇక ఈ చిత్రాలు తరువాత లవ్ స్టోరీస్ స్పెషలిస్ట్ హను రాఘవపూడితో కూడా ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

హను రాఘవపూడి గత సినిమాలు మాదిరి అది కూడా ఒక హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ అని అందరూ భావించారు. కానీ ఆ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతుందట. ప్రీ ఇండిపెండెన్స్ టైంలో హైదరాబాద్ సంస్థానంలో రజాకార్ ఆధిపత్యం గురించి అందరికి తెలిసిందే. ఇటీవల ఈ కథతో ‘రజాకార్’ అనే సినిమా కూడా వచ్చి సూపర్ హిట్టుగా నిలిచింది. ఇప్పుడు ఆ కథనే తీసుకోని యుద్ధం బ్యాక్‌డ్రాప్ తో హను రాఘవపూడి, ప్రభాస్ సినిమాని తెరకెక్కించబోతున్నారట.

ఆల్రెడీ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ని స్టార్ట్ చేసిన దర్శకుడు.. మ్యూజిక్ సిట్టింగ్స్ ని కూడా ఫుల్ స్వింగ్ లో ముందుకు తీసుకు వెళ్తున్నారట. తన సినిమాలకు సూపర్ హిట్ మ్యూజిక్ ని అందించే విశాల్ చంద్రశేఖర్‌నే.. ఈ సినిమాకి తీసుకున్నారట. ఆల్రెడీ మూడు సాంగ్స్ కంపొజిషన్ అయ్యిపోయిందంటూ హను రాఘవపూడి తెలియజేసారు. త్వరలోనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా ఫినిష్ చేసి సెట్స్ పైకి ఈ సినిమాని తీసుకు వెళ్లనున్నారు.

కాగా హను రాఘవపూడి ఇన్నాళ్లు సీతారామం, పడి పడి లేచే మనసు, కృష్ణగాడి వీరప్రేమగాధ, అందాల రాక్షసి వంటి లవ్ స్టోరీస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు మొదటిసారి తన జోనర్ దాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాని టచ్ చేస్తున్నారు. మరి ఈ ప్రయోగంతో హిట్ అందుకుంటారో లేదో చూడాలి.

Also read : Siddharth : ఎంగేజ్మెంట్ పై సిద్దార్థ్ కామెంట్స్.. మేము సీక్రెట్‌గా ఏమి చేసుకోలేదు..

 

  Last Updated: 08 Apr 2024, 12:07 PM IST