Site icon HashtagU Telugu

Prabhas : ప్రభాస్ కోసం పాకిస్థాన్ భామని తీసుకొస్తున్న హను రాఘవపూడి.. నిజమేనా..!

Hanu Raghavapudi, Sajal Ali, Prabhas

Hanu Raghavapudi, Sajal Ali, Prabhas

Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ప్రేమ కథల స్పెషలిస్ట్ హను రాఘవపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ పై ప్రభాస్ అభిమానుల్లో కూడా ఎంతో ఆసక్తి కనిపిస్తుంది. హను రాఘవపూడి తన ప్రేమ కథల నేపథ్యంతోనే ప్రభాస్ తో సినిమా చేస్తారా..? లేదా మరేమైనా కొత్త నేపథ్యంతో ఆడియన్స్ ని థ్రిల్ చేస్తారా..? అనే క్యూరియాసిటీ నెలకుంది. దీంతో ఈ మూవీకి సంబంధించిన ఏదొక రూమర్ నెట్టింట వైరల్ అవుతూ వస్తుంది.

ఇక తాజాగా ప్రభాస్ కి జోడిగా కనిపించే భామ గురించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన ఐదు సినిమాల్లో.. నాలుగింటిలోకి కొత్త హీరోయిన్స్ నే తీసుకున్నారు. అందాల రాక్షసితో లావణ్య త్రిపాఠి, కృష్ణగాడి వీరప్రేమగాథతో మెహ్రీన్ పిర్జాదా, లైతో మేఘా ఆకాష్, సీతారామంతో మృణాల్ ఠాకూర్‌ని టాలీవుడ్ కి పరిచయం చేసారు. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమా కోసం కూడా కొత్త హీరోయినే తీసుకు రాబోతున్నారట. అయితే ఈసారి రాష్ట్రాలు దాటేసే, పొరుగు దేశం భామని టాలీవుడ్ కి తీసుకు వస్తున్నారు.

మన దాయాది దేశం పాకిస్తాన్ నుంచి ‘సజల్ అలీ’ అనే భామని ప్రభాస్ కి జోడిగా ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ లో పలు సినిమాల్లో నటించిన ఈ భామ.. గతంలో శ్రీదేవి ‘మామ్’ మూవీలో కనిపించింది. ఇక ఇప్పుడు ప్రభాస్ సినిమాతో మరోసారి ఇండియన్ ఆడియన్స్ ని పలకరించనుందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. కాగా ఈ సినిమాని ఆగష్టు నెలలో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసి.. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారట.

Exit mobile version