Hanu-Man Trailer: హనుమాన్ ట్రైలర్ వచ్చేసింది.. అంజనాద్రి లోకం అద్భుతం!

హను-మాన్ థియేట్రికల్ ట్రైలర్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది.

Published By: HashtagU Telugu Desk
Hanuman

Hanuman

Hanu-Man Trailer: ఇప్పుడు విడుదలైన హను-మాన్ థియేట్రికల్ ట్రైలర్ కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకోవడంతో ట్రైలర్‌పై భారీ హైప్ వచ్చింది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, అండర్ వాటర్ సీక్వెన్స్‌లో తేజను పరిచయం చేస్తూ ఒక చిరుతను వెంటాడి, ఆపై తన సూపర్ పవర్స్ చూపిస్తూ అంజనాద్రి లోకానికి తీసుకెళ్లాడు.

ఈ ట్రైలర్ ను చూస్తే గుడ్ వర్సెస్ ఈవిల్ పోరాటానికి సంబంధించిందిగా ఉంది. ప్రశాంత్ వర్మ కొత్త, అందమైన ప్రపంచానికి తీసుకెళ్లారు. మునుపెన్నడూ లేని అనుభూతిని అందించారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. అఖండ భారతంలోని ఇతిహాసాల నుండి ప్రేరణ పొందిన కథ నైపుణ్యం కలిగిన కథనంతో మంత్రముగ్ధంగా చిత్రీకరించబడింది.

చివర్లో బ్యాక్ టు బ్యాక్ సీక్వెన్స్‌లు- కథానాయకుడు జై శ్రీరామ్ అని అరవడం, చెట్టు కొమ్మతో హెలికాప్టర్‌ను ఆపడం, ఆపై హనుమంతుని నిజ స్వరూపం, ట్రైలర్ స్థాయి వివరించడానికి మాటలు సరిపోవు. దాశరధి శివేంద్ర కెమెరా పనితనం ప్రత్యేకంగా నిలుస్తుంది. విజువల్స్ కన్నుల పండువగా ఉన్నాయి, అయితే శ్లోకాలతో హరి గౌర అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ ఇస్తుంది. మొత్తంమీద, ట్రైలర్ మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తుంది. అయితే ఈ భారీ చిత్రాన్ని థియేటర్లలో చూడాలంటే జనవరి 12 వరకు ఆగాల్సిందే.

  Last Updated: 19 Dec 2023, 12:26 PM IST