Site icon HashtagU Telugu

Hanu Man First Review : ‘హనుమాన్’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. రేటింగ్ మాములుగా ఇవ్వలేదు

Hanman Review

Hanman Review

ప్రశాంత్ వర్మ – తేజ సజ్జ (Prasanth Varma – Teja Sajja) కలయికలో తెరకెక్కిన మూవీ హనుమాన్ (Hanu Man). ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సంక్రాంతి బరిలో మహేష్ బాబు , వెంకటేష్ , నాగార్జున వంటి పెద్ద హీరోలు పోటీపడుతున్నప్పటికీ..డైరెక్టర్ ప్రశాంత్ వర్మ..నిర్మాత నిరంజన్ పట్టుబట్టి సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీనికి కారణం కథపై వారికీ ఉన్న నమ్మకమే. కథలో దమ్ముండాలి కానీ పక్కన పెద్ద హీరోలు కాదు ఇంకెవరు ఉన్న ప్రేక్షకులు బ్రహ్మ రథం పడుతారు. గతంలో సంక్రాంతి సీజన్ లో ఎన్నో పెద్ద చిత్రాల నడుమ చిన్న చిత్రాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాదు కలెక్షన్ల వర్షం కురిపించాయి. దీనికి ఉదాహరణే శతమానం భవతి. పక్కన చిరంజీవి , బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలు ఉన్నప్పటికీ..దిల్ రాజు ఈ సినిమా ఫై ఉన్న నమ్మకం తో రిలీజ్ చేసి సూపర్ హిట్ అందుకున్నాడు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు హనుమాన్ (Hanu Man) విషయంలో కూడా నిర్మాతలు అలాగే చేసారు. రేపు ఈ మూవీ వరల్డ్ వైడ్ గా పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా..ఈరోజు పలు చోట్లా ప్రీమియర్ షోస్ వేసి ఆకట్టుకున్నారు. తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్ కథానాయికగా నటించారు. వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

ఇక ఈ మూవీ ని చూసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ (Tarun Adarsh)..సినిమా అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. 3.5 రేటింగ్ (Hanu Man Rating) ఇచ్చి అదరహో అని కొనియాడాడు. హనుమాన్ ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తుందని, డ్రామా,ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, మైథాలజీ ఇలా అన్ని యాంగిల్స్‌లో అద్భుతంగా ఉందని.. ఎన్నో గూస్ బంప్స్ మూమెంట్స్ ఉన్నాయని , కచ్చితంగా చూడాల్సిన సినిమా అని చెప్పుకొచ్చాడు.

ఇక నటి నటుల యాక్టింగ్ విషయానికి వస్తే.. తేజ సజ్జా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వరలక్ష్మీ శరత్ కుమార్ తన మార్క్‌ని ప్రదర్శించింది. వినయ్ రాయ్ చాలా భయంకరంగా కనిపించాడు. సముద్రఖని తన సూపర్ ఫామ్‌ని కొనసాగించాడు. వెన్నెల కిశోర్‌ చాలా బాగా చేశాడు. ఇంకొన్ని సన్నివేశాలు ఆయన చేస్తే బాగుండేది. కథకు సరిపడా విఎఫ్‌ఎక్స్ కీలక భూమిక పోషించాయి. డబ్బింగ్ కూడా పర్ఫెక్ట్‌గా కుదిరింది. కాకపోతే రన్ టైం కాస్త తగ్గిస్తే బాగుండేదని..ఫస్టాఫ్‌లో కొన్ని సీన్లు లాగ్ అనిపించాయని తెలిపారు తరుణ్. తరణ్ ఆదర్శ్ లాంటి సీనియర్ అనలిస్ట్ సినిమా గొప్పగా ఉందని చెప్పాడంటే ఇక సినిమా ఏ రేంజ్ లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Read Also : Free Bus Travel: అలాంటి మహిళలు ఫ్రీ జర్నీ చేస్తే బిచ్చగాళ్లతో సమానం