Site icon HashtagU Telugu

Hansika Hormone Injection: హన్సిక హార్మోన్స్ ఇంజక్షన్ : వాస్తవమెంత ?

Hansika

Hansika

Hansika Hormone Injection:బాలనటిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన హన్సిక మోత్వాని (Hansika Motwani) ఒక దశలో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. పూరీజగన్నాధ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, హన్సిక జంటగా నటించిన దేశముదురు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమాతో హన్సిక సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ సినిమాతో హన్సిక పేట్ మారిపోయింది. వరుస సినిమాలు క్యూ కట్టాయి. స్టార్ హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఈ అమ్మడు ఒక్క తెలుగులోనే కాకుండా బాలీవుడ్, తమిళంలో నటించి మెప్పించింది. అయితే హన్సికని ఓ రూమర్ ఎప్పటినుంచో వెంటాడుతుంది. ఆమె హార్మోన్ల పెరుగుదల కోసం ఇంజెక్షన్లు తీసుకున్నదని ఆరోపణలు ఎదుర్కొన్నది.
.
‘షక లక బూమ్ బూమ్’ షో ద్వారా చైల్డ్ ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చుకున్న హన్సిక హృతిక్ రోషన్‌తో కలిసి ‘కోయి మిల్ గయా’లో పనిచేసింది. హన్సిక హిమేష్ రేష్మియా మ్యూజిక్ ఆల్బమ్ ‘ఆప్ కా సురూర్’లోనూ కనిపించింది, అప్పుడు ఆమె అందాలను చూసి ఆశ్చర్యపోయారు. ఒక్కసారిగా ఆమె బాడీలో మార్పులు రావడంతో సోషల్ మీడియా వేదికగా అనేక కామెంట్స్ వినిపించాయి. మీడియా సైతం ఆమె సైజులపై కథనాలు అల్లింది.

హార్మోన్స్ ఇంజక్షన్ (Hormone Injection) పై హన్సిక తల్లి మౌనం వీడారు. హన్సికపై వస్తున్న ఆరోపణలపై ఆమె తాజాగా స్పందించారు. హన్సిక తల్లి మోనా మోత్వాని ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ‘ఎముకలను ప్రోత్సహించే ఇంజక్షన్ ఏదైనా ఉందా. ఏ తల్లి అయినా ఇలా ఎందుకు చేస్తుంది. ఒకరి ఎదుగుదలని చూసి అసూయపడే వారు ఇలాంటి కామెంట్స్ చేస్తారని, ఇలాంటి వార్తలు ప్రచురించడానికి డబ్బు చెల్లించి రాయిస్తారని, , దీని వెనుక ఎవరున్నారో మాకు తెలియడం లేదని అన్నారు. హన్సికపై వస్తున్న ఆరోపణలను ఆమె కొట్టివేస్తూ అందులో ఎటువంటి నిజం లేదని తెలిపింది.

హన్సిక మాట్లాడుతూ.. నాకు సూదులంటే భయం. సూది భయంతో నేను టాటూ కూడా వేయించుకోలేదు. తమ ఎదుగుదలను చూసి కొందరు ఈర్ష్య పడుతున్నారని అన్నారు.

Read More: Spirituality: ఐదోతనం అంటే ఏమిటి.. ముత్తైదువని ఎవరిని పిలవాలో తెలుసా?