Site icon HashtagU Telugu

Hansika Motwani : పెళ్లి తర్వాత జీవితం గురించి హన్సిక కామెంట్స్.. అందుకే ఇంటి పేరు మార్చుకోను..

Hansika Motwani Comments on her Marriage Life

Hansika Motwani Comments on her Marriage Life

యాపిల్ బ్యూటీ హన్సిక(Hansika Motwani) చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి దేశముదురు సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ్, హిందీలో వరుస సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలు చేసిన హన్సిక మధ్యలో ఫ్లాప్స్ రావడంతో అడపాదడపా సినిమాలు చేస్తుంది.

ఇక ఇటీవల కొన్ని నెలల క్రితం సోహైల్ అనే ఓ వ్యాపారవేత్తని హన్సిక పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూనే సినిమాలు చేస్తుంది. త్వరలో మై నేమ్ ఈజ్ శృతి(My Name Is Shruthi) అనే సినిమాతో రాబోతుంది హన్సిక. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఓ ఇంటర్వ్యూలో హన్సికని పెళ్లి తర్వాత జీవితం గురించి అడిగారు.

దీనికి హన్సిక సమాధానమిస్తూ.. సోహైల్ తో పెళ్లయ్యాక నా లైఫ్ ఏం మారలేదు. సినిమా షూటింగ్ టైంలో నా క్యారెక్టర్ లో ఉంటాను. ఇంటికెళ్ళాక భర్తతో ఉంటాను. ఆయనకు టైం కేటాయిస్తాను. అలాగే పెళ్లి తర్వాత కేవలం నా ఇంటి అడ్రెస్ మాత్రమే మారింది. నా ఇంటిపేరు మారలేదు. హన్సిక మోత్వానీ పేరు కోసం చాలా కష్టపడ్డాను. అందుకే ఇంటిపేరుని మార్చకుండా అలాగే ఉంచాను అని చెప్పింది.

 

Also Read : Samantha : విడాకులు, సినిమా ఫ్లాప్స్, ఆరోగ్య సమస్యలు.. అన్ని ఒకేసారి వచ్చాయి.. సమంత సంచలన వ్యాఖ్యలు..