Hamsa Nandini: క్యాన్సర్ నుంచి కోలుకున్న హంసనందిని.. ఇన్ స్టాలో ‘ఎమోషనల్’ పోస్ట్!

టాలీవుడ్ బ్యూటీ హంస నందిని క్యాన్సర్ నుంచి కోలుకున్నారు.

Published By: HashtagU Telugu Desk
Hamsa

Hamsa

టాలీవుడ్ హాట్ బ్యూటీల్లో హంస నందిని (Hamsa Nandini) ఒకరు. ఈ నటి పలు హిట్ సినిమాల్లో నటించడమే కాకుండా, ఐటెం సాంగ్స్ తో తెలుగు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది. కెరీర్ మంచి జట్ స్పీడ్ లో ఉండగానే క్యాన్సర్ రూపంలో దురద్రుష్టం వెంటాడింది. హంసా నంది వంశపారంపర్యంగా వచ్చే రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని నెలల తర్వాత క్యాన్సర్ నుంచి కోలుకొని హంస నందిని (Hamsa Nandini) ఇన్ స్టా గ్రామ్ వేదికగా మళ్లీ ముందుకొచ్చింది.

ఆమె తన పుట్టినరోజు సందర్భంగా ఓ సెట్ లో దిగిన ఫొటోను అభిమానులతో షేర్ చేసింది. ఈ సందర్భంగా ఓ ఎమోషనల్ (Emotional) పోస్ట్ పెట్టింది. మళ్లీ కెమెరా ముందు రావడం సంతోషంగా భావిస్తున్నా. ఈ రాత్రి నా సహనటులు & నా చిత్ర బృందంతో పుట్టినరోజును జరుపుకుంటున్నా. నేను చాలా మిస్ అయ్యాను.

మీ అందరి ప్రేమకు థ్యాంక్స్ చెప్పకుండ ఉండలేను’’ అంటూ కిస్సింగ్ ఎమోజీతో పోస్ట్ చేసింది. గత డిసెంబర్‌లో హంసా నందిని ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు రొమ్ము క్యాన్సర్‌ వచ్చిందని, ఇప్పటికే తొమ్మిది సైకిల్స్ కీమోథెరపీ చేయించుకున్నానని, మరో ఏడు మిలిగి ఉన్నాయని అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

  Last Updated: 08 Dec 2022, 05:39 PM IST