నేచురల్ స్టార్ నాని (Nani) , సీతారామం ఫేమ్ మృణాల్ (Mrunal Thakur) జంటగా నూతన డైరెక్టర్ శౌరవ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ‘హాయ్ నాన్న’. ప్రస్తుతం షూటింగ్ అంత పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టి సినిమా ఫై ఆసక్తి పెంచుతున్నారు. ఇప్పటికే గ్లిమ్ప్స్ తో ఇంప్రెస్ చేసిన మేకర్స్… తాజాగా గాజుబొమ్మ అనే మెలోడీ సాంగ్ ప్రోమో ను రిలీజ్ చేసి అంచనాలు పెంచారు.
We’re now on WhatsApp. Click to Join.
‘గాజు బొమ్మ’ అంటూ సాగనున్న ఈ సాంగ్ కి నాని స్పెషల్ అనౌన్స్మెంట్ ప్రోమో చేసాడు. ఈ ప్రోమో లో కిచెన్ లో నాని పాట పాడుతూ వంటపని చేస్తుంటాడు. ఇంతలో పాప… నాన్నా ఇది లవ్ స్టోరీయా అని ప్రశ్నిస్తుంది. అవును… లవ్ స్టోరీనే అని నాని రిప్లయ్ ఇస్తాడు. అయితే మన స్టోరీ కాదా అని పాప ప్రశ్నించగా, కాసేపు ఆలోచించిన నాని మన స్టోరీ కూడా అని చెబుతాడు.
Read Also : Lulu Mall : ‘లులు ‘ ఖాళీ..గల్లా ఖాళీ
నువ్వు లవ్ సాంగ్ రిలీజ్ చేశావ్… మరి మన సాంగ్ ఎప్పుడొస్తుంది అని పాప ప్రశ్నించగా… నా గాజు బొమ్మ అంటూ కూతురిని ముద్దు చేస్తాడు… నువ్వు రెడీయా అని పాపను అడగ్గా, రెడీ అని పాప జవాబిస్తుంది. అనంతరం, వీడియోలో గాజు బొమ్మ సాంగ్ ప్రోమో బిట్ దర్శనమిస్తుంది. ఈ పాట అక్టోబరు 6న రిలీజ్ కానున్నట్టు వీడియోలో పేర్కొన్నారు. ప్రోమో చివరలో మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ ఇచ్చిన మ్యూజిక్ బిట్ ఎక్స్ట్రాడినరిగా ఉంది. ఇక ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతుంది.
To every father ♥️
This one will be special …#HiNanna #GaajuBomma pic.twitter.com/NfnKX7hbrq— Nani (@NameisNani) October 3, 2023
