Guntur Karam vs Hanuman : హనుమాన్ కి ప్లస్ అయ్యేలా గుంటూరు కారం డివైడ్ టాక్..!

Guntur Karam vs Hanuman త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ కాంబో సినిమా అనగానే గుంటూరు కారం మీద తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి.

Published By: HashtagU Telugu Desk
Guntur Karam Vs Hanuman Mahesh Guntur Karam Talk Plus Point To Hanuman Movie

Guntur Karam Vs Hanuman Mahesh Guntur Karam Talk Plus Point To Hanuman Movie

Guntur Karam vs Hanuman త్రివిక్రం సూపర్ స్టార్ మహేష్ కాంబో సినిమా అనగానే గుంటూరు కారం మీద తారాస్థాయి అంచనాలు ఏర్పడ్డాయి. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో రాధాకృష్ణ నిర్మించిన గుంటూరు కారం సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా మొదటి షో నుంచి మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అంతా మహేష్ వన్ మ్యాన్ షో చేసినా బలైమ కథ కథనాలు లేకపోవడం మైనస్ గా చెప్పుకుంటున్నారు. ముఖ్యంగా త్రివిక్రం మార్క్ ఎక్కడ కనిపించలేదని ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.

We’re now on WhatsApp : Click to Join

సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ కి మహేష్ వన్ మ్యాన్ షో పర్ఫార్మెన్స్ నచ్చినా కామన్ ఆడియన్స్ మాత్రం గుంటూరు కారం గురించి డివైడ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. అయితే ఈ టాక్ వల్ల ఈరోజు రిలీజైన మరో సినిమా హనుమాన్ కి ప్లస్ అవుతుంది. ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా ఫస్ట్ ఇండియన్ సూపర్ హీరో మూవీగా భారీ క్రేజ్ తెచ్చుకుంది. చిన్న సినిమాగా మొదలైన హనుమాన్ రోజు రోజుకి బజ్ పెంచుకుంటూ వచ్చింది. సంక్రాంతి పెద్ద సినిమాల మధ్య పోటీని తట్టుకునేందుకు చాలా కష్టపడ్డారు చిత్ర యూనిట్.

హనుమాన్ ని సంక్రాంతి రేసు నుంచి తప్పించాలని చాలా ప్లాన్ చేశారు. కానీ సినిమా సంక్రాంతికి వదలాలని ఫిక్స్ అయ్యిన మేకర్స్ తక్కువ థియేటర్స్ అయినా సరే రిలీజ్ చేద్దామని అనుకుని రిలీజ్ చేశారు. దాదాపు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న సింగిల్ స్క్రీన్స్ అన్నీ మహేష్ గుంటూరు కారం సినిమాకే ప్రిఫర్ చేశారు. కొన్ని చోట్ల మాత్రమే హనుమాన్ అందుబాటులో ఉంది. అయితే గుంటూరు కారం సినిమాకు డివైడ్ టాక్ రావడం హనుమాన్ సినిమాకు కలిసి వచ్చేలా ఉంది.

Also Read : Nayanthara: నటి నయనతారపై పోలీస్ కేసు, కారణమిదే

అ! సినిమా నుంచి తన ప్రతి సినిమాతో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూ వస్తున్న ప్రశాంత్ వర్మ హనుమాన్ తో మరోసారి తన ప్రతిభ చాటిచెప్పేలా చేసుకున్నాడు. స్టార్ సినిమాల మధ్య రిలీజ్ అన్నప్పుడే సినిమా మీద అతనికి ఉన్న కాన్ ఫిడెన్స్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అనుకున్నట్టుగానే గుంటూరు కారం ని హనుమాన్ బీట్ చేసేలా ఉన్నాడు. కలెక్షన్స్ పరంగా గుంటూరు కారం ని ఇప్పుడప్పుడే క్రాస్ చేయలేకపోయినా పబ్లిక్ టాక్ ప్రకారం హనుమాన్ యునానిమస్ హిట్ టాక్ తెచ్చుకోగా గుంటూరు కారం మాత్రం కొందరు పాజిటివ్ గా కొందరు నెగిటివ్ గా చెబుతున్నారు.

  Last Updated: 12 Jan 2024, 05:35 PM IST