మహేష్ గుంటూరు కారం (Guntur Karam) శుక్రవారం రిలీజై మిక్సెడ్ టాక్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. త్రివిక్రం డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీని హారిక హాసిని బ్యానర్ లో భారీ బడ్జెట్ తో నిర్మించారు. అయితే ఈ సినిమా కథ కథనాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రం మ్యాజిక్ కనిపించలేదని ఆడియన్స్ వెల్లడించారు. నిన్న మార్నింగ్ షో నుంచి కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ తప్ప మిగతా వారంతా కూడా సినిమా కేవలం మహేష్ బాబు కోసం ఒకసారి చూసేయొచ్చని అంటున్నారు.
We’re now on WhatsApp : Click to Join
ఇక ఈ క్రమంలో గుంటూరు కారం నుంచి మరో న్యూస్ సోషల్ మీడియాలో హడావుడి చేస్తుంది. గుంటూరు కారం కథ ముందు త్రివిక్రం ఎన్.టి.ఆర్ (NTR) కి చెప్పాడని ఆయన కాదనడం వల్ల మహేష్ కి చెప్పి ఒప్పించాడని అంటున్నారు. ఎన్.టి.ఆర్ తో త్రివిక్రం అరవింద సమేత సినిమా చేశాడు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి ఫలితాన్ని అందించింది. త్రివిక్రం తో తారక్ చేసిన మొదటి సినిమా అదే. ఆ సినిమాలో ఎన్.టి.ఆర్ క్యారెక్టరైజేషన్ చాలా సెటిల్డ్ గా ఉంటుంది.
ఆ సినిమా టైం లో గురూజీతో మంచి అనుబంధం ఏర్పడటంతో త్రివిక్రం తో సినిమా ఆయన అడగాలే కానీ తాను తప్పకుండా చేస్తానని ఎన్.టి.ఆర్ అన్నారు. అయితే ఎన్.టి.ఆర్ గుంటూరు కారం కథ విని కూడా వద్దని అన్నారని చెప్పుకుంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వాస్తవం ఉందో తెలియదు కానీ ఎన్.టి.ఆర్ ఈ సినిమా కథ రిజెక్ట్ చేసి మంచి పని చేశాడని తారక్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
స్టార్ హీరోల కథలు ఒకరు చేయాల్సినవి మరొకరు చేయడం కామన్. డేట్స్ అడ్జెస్ట్ అవ్వక కొన్నిసార్లు.. కథ నచ్చక మరికొన్ని సార్లు సినిమాలు చేతులు మారుతుంటాయి. అయితే హిట్ అయితే మంచి సినిమా మిస్ అయ్యామనే ఆలోచన తో పాటుగా ఫ్లాప్ అయితే సినిమా రిజెక్ట్ చేసుకుని మంచి పనిచేశామని అనుకోవడం కామనే అయ్యింది. అయితే స్టార్స్ కన్నా వారి అభిమానులు ఈ విషయంలో ఎక్కువ ఫీల్ అవుతుంటారు.
Also Read : Hanuman : హనుమాన్ హిట్ టాక్ తో ఆ డైరెక్టర్ పై మండిపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్..!
మహేష్ త్రివిక్రం ఇదివరకు అతడు, ఖలేజా సినిమాలు చేయగా హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం భారీ అంచనాల మధ్య వచ్చి డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించాడు. సాంగ్స్ ఓకే అనిపించినా బిజిఎం తో థమన్ నిరాశపరిచాడు.