Guntur Karam Deleted Scenes సూపర్ స్టార్ మహేష్ నటించిన గుంటూరు కారం సినిమా సంక్రాంతికి రిలీజై సూపర్ హిట్ అయ్యింది. ముందు టాక్ బాగా లేకపోయినా మహేష్ మేనియాతో సినిమా హిట్ గా నిలిచింది. వారం రోజుల్లోనే ఈ సినిమా 212 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని నిర్మాతలు ప్రకటించారు. ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్ తో పాటుగా డ్యాన్స్ లు కూడ అదరగొట్టాడు. ఈ సినిమాలో మహేష్ ని సూపర్ ఎనర్జీతో చూడటం ఫ్యాన్స్ ని మెప్పించింది. సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించగా మీనాక్షి చౌదరి ఒక స్పెషల్ రోల్ చేసింది.
We’re now on WhatsApp : Click to Join
అయితే ఈ సినిమా రిలీజై 10 రోజులు అవుతుండగా సినిమా నుంచి డిలీటెడ్ సీన్ ఒకటి రిలీజ్ చేస్తున్నారట. అయితే అది థియేటర్ లో కాదు యూట్యూబ్ లో అని తెలుస్తుంది. సినిమాలో భారీ యాక్షన్ సీన్ ఒకటి షూట్ చేశారు. 10 కోట్ల విలువ కలిగిన ఈ యాక్షన్ సీన్ ని ఎందుకో ఫైనల్ కట్ లో లేపేశారు. సినిమా రన్ టైం ఎక్కువ అవుతుందన్న కారణం వల్లో లేదా మరో రీజనో కానీ సినిమా లో ఆ యాక్షన్ సీన్ లేదు.
అయితే గుంటూరు కారం (Guntur Karam) సినిమా హిట్ అవ్వడంతో ఆ సినిమాకు సంబంధించిన ఆ యాక్షన్ సీన్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని చొస్తున్నారట. కె.జి.ఎఫ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ అంబరివ్ ఈ ఫైట్స్ ని కంపోజ్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమాతో మహేష్ మరోసారి తన మాస్ స్టామినా చూపించాడు.
Also Read : Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ పాటలకే పరిమితమా, జాన్వీ పాత్రపై గుసగుసలు
ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. సినిమా కోసం మహేష్ తన లుక్ టెస్ట్ కోసం జర్మనీ వెళ్లాడని టాక్. ఈ సినిమాతో మహేష్ పాన్ వరల్డ్ స్టార్ గా ఎదగడం కన్ ఫర్మ్ అనేస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.