Site icon HashtagU Telugu

Guntur Karam : వివాదంలో గుంటూరు కారం

Mahesh Babu Guntur Karam Another Song Surprise

Mahesh Babu Guntur Karam Another Song Surprise

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రానికి వరుస వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు పలు వివాదాలు వార్తల్లో నిలువగా..ఇక అంత సెట్ అయ్యింది అని రిలీజ్ కార్యక్రమాల్లో మేకర్స్ ఉండగా..తాజాగా ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చి నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఈ సినిమా స్టోరీ యద్దనపూడి సులోచనారాణి (Yaddanapudi Sulochanarani) నవల ‘కీర్తి కిరీటాలు’ (Keerthi Kireetaalu ) ఆధారంగా తెరకెక్కిందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.

గతంలో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అ..ఆ’ సినిమా విషయంలోనూ అలాగే జరిగింది. యద్దనపూడి సులోచనారాణి నవల ‘మీనా’ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఆ సమయంలో యద్దనపూడికి క్రెడిట్ ఇవ్వలేదని పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో… విడుదలైన కొన్ని రోజుల తరువాత ఆమె పేరు పెట్టి ఆమెకి క్రెడిట్ ఇచ్చారు త్రివిక్రమ్. ఇప్పుడు గుంటూరు కారం విషయంలోనూ అలాగే మాట్లాడుకుంటున్నారు. నిజంగా ‘కీర్తి కిరీటాలు’ నవల ఆధారంగా సినిమా తెరకెక్కిందా..లేదా అనేది సినిమా విడుదలైతే కానీ తెలియదు. ప్రస్తుతం గుంటూరు కారం ఆ నవల ఆధారంగా తెరకెక్కించారని చాలామంది సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు. దీనిపై ఏమైనా మేకర్స్ స్పందిస్తుందా అనేది చూడాలి.

We’re now on WhatsApp. Click to Join.

గుంటూరు కారం విషయానికి వస్తే. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) డైరెక్షన్లో మహేశ్ బాబు (Mahesh Babu), శ్రీ లీల (Sreeleela) మీనాక్షి చౌదరి (Meenakshi ) జంటగా తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం (Guntur Kaaram). ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , పోస్టర్స్ ఇలా ప్రతిదీ సినిమాపై ఆసక్తి పెంచాయి. ఇక రీసెంట్ గా క్రిస్మస్ సందర్బంగా స్పెషల్ పోస్టర్‌లో రిలీజ్ చేయగా..అందులో క్లాస్ లుక్ లో మహేష్ కనిపించారు. ఇక సెన్సార్ సైతం పూర్తి చేసుకొని యూ/ఏ సర్టిఫికెట్ పొందింది. రేపు ఈ మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో గ్రాండ్ గా జరగబోతుంది. ఈ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు.

Read Also : MS Dhoni: రూ.15 కోట్ల మోసానికి గురైన మహేంద్ర సింగ్ ధోనీ.. క్రిమినల్ కేసు దాఖలు, ఏం జరిగిందంటే..?