Site icon HashtagU Telugu

Guntur Kaaram Trailer : గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ & ట్రైలర్ రిలీజ్ ఫిక్స్

Gunturkaaram Trailer Date

Gunturkaaram Trailer Date

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram), మహేశ్ బాబు (Mahesh Babu) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి సందర్బంగా ఈ మూవీ జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే విడుదలైన సినిమా తాలూకా సాంగ్స్ , టీజర్ , పోస్టర్స్ ఇలా ప్రతిదీ సినిమాపై ఆసక్తి పెంచేస్తున్నాయి. తాజాగా క్రిస్మస్ సందర్బంగా స్పెషల్ పోస్టర్‌లో రిలీజ్ చేయగా..అందులో క్లాస్ లుక్ లో మహేష్ కనిపించారు. ఇక ఇప్పుడు యావత్ అభిమానులు ఎదురుచూస్తున్న ట్రైలర్ కు సంబదించిన అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ నెల 06 న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్లాన్ చేసారు. అదే రోజున చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ తన అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ అప్డేట్ తో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరీ లు హీరోయిన్స్ గా నటిస్తుండగా.. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ అమెరికా లో మొదలవ్వగా హాట్ కేకుల్లా సేల్ అవుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ 150k డాలర్లు దాటాయి. ఇక ప్రస్తుతం బుకింగ్ ట్రెండ్ ప్రకారం.. గుంటూరు కారం ఓవర్సీస్ లో రిలీజ్ కు ముందే వన్ మిలియన్ మార్క్ దాటిన రీజనల్ సినిమాగా నిలిచింది. అతి త్వరలోనే 1.5 మిలియన్ మార్క్ ని కూడా అందుకోవచ్చు అని అంటున్నారు.

Read Also : YS Sharmila : అన్నతో ముగిసిన చెల్లెమ్మ భేటీ..