అగ్ర హీరోల చిత్రాలు వస్తున్నాయంటే వారం రోజుల పాటు సినిమా టికెట్ ధరలు (Tiket Price ) ఆకాశానికి తాకుతాయి. ఇది ప్రతిసారి జరిగేది..అయినప్పటికీ అభిమానులు వాటిని ఏమాత్రం లెక్కచేయరు..టికెట్ ధర వెయ్యి రూపాయిలు ఉన్న సరే తీసుకొనే తీరుతాం అని ధీమా వ్యక్తం చేస్తారు. అందుకే దీనిని దృష్టిలో పెట్టుకొని సదరు నిర్మాతలు..వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ప్రభుత్వాల నుండి పర్మిషన్ తీసుకొని టికెట్ ధరలను భారీగా పెంచేస్తుంటారు.
ఇక తెలంగాణ (Telangana) విషయానికి వస్తే చిత్రసీమ విషయంలో అధికారంలోకి ఏ ప్రభుత్వం వచ్చిన వారిని ఇబ్బందికి గురి చేయకుండా వారు అడిగిన దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వమే కాకుండా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం టాలీవుడ్ ఫై పెద్దగా ఆంక్షలు విధించకుండా సపోర్ట్ గా నిలుస్తూ వస్తుంది. రీసెంట్ గా ప్రభాస్ నటించిన సలార్ (Salaar) చిత్ర టికెట్ విషయంలో కూడా నిర్మాతలకు సంతోష పెట్టింది. వారం రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేలా ఆదేశాలు ఇవ్వడం తో సింగిల్ స్ర్కీన్స్‌లో టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్‌లలో ధర రూ.400 వరకు పెంచారు. దీంతో నిర్మాతలకు భారీ లాభాలు వచ్చాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఇప్పుడు గుంటూరు కారం విషయంలోనూ తెలంగాణ సర్కార్ టికెట్ ధరలు పెంచుకునేలా ఆదేశాలు జారీ చేసింది. సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ ఫై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొని ఉన్నాయో..మాటల్లో చెప్పలేం. వీరిద్దరి కలయికలో గతంలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో రెండు రోజుల్లో జనవరి 12 న ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ఇప్పటికే ఈ చిత్రంలోని సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ ఆసక్తి పెంచగా..తాజాగా విడుదలైన ట్రైలర్ దుమ్ములేపింది. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఈ ట్రైలర్ చెప్పకనే చెప్పింది. దీంతో సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకు స్పెషల్ షోలతో పాటు టికెట్ ధరలను కూడా పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. దీంతో సింగిల్ స్ర్కీన్స్‌లో టికెట్ ధర రూ.250, మల్టీప్లెక్స్‌లలో ధర రూ.410 ఉండనుంది. ఇక ఈ ధరలు ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ అమలులో ఉండనున్నాయి.
Read Also : Vishnu Priya Hot in Bed : హాట్ హాట్ ఫోజులతో నిద్ర పట్టకుండా చేస్తున్న విష్ణు ప్రియ