Site icon HashtagU Telugu

Guntur Kaaram Trailer: సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న గుంటూరు కారం ట్రైలర్

Guntur Kaaram Trailer talk

Guntur Kaaram Trailer talk

Guntur Kaaram Trailer: ఘట్టమనేని అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన గుంటూరు కారం సినిమా ట్రైలర్ విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తుండటంతో సినిమాతో భారీ అంచనాలు నమోదయ్యాయి. ఇక ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ కావడం సినిమాకు మరింత ఆకర్షణ. ఈ సినిమా నుంచి ఇప్పటికే పలు గ్లిమ్స్ వచ్చాయి. ఆ తర్వాత ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ట్రైలర్ కూడా తాజాగా విడుదలైంది. ట్రైలర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది.

అతడు, ఖలేజా చిత్రాల తర్వాత మహేష్‌, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ తర్వాత ఈ స్టార్ హీరో, దర్శకుడు సంక్రాంతి బరిలో నిలిచారు. నిజానికి హైదారాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి ఆ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. కొన్ని ప్రభుత్వం తీసుకున్న అత్యవసర నిర్ణయంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కుదరలేదు. దీంతో గుంటూరు కారం సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ విషయానికి వస్తే.. మహేష్‌ బాబు క్యారెక్టర్ మాస్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసేలా డిజైన్ చేశారు త్రివిక్రమ్. యాక్షన్, ఎమోషన్, డైలాగ్స్ లో మహేష్‌ అదరగొట్టేస్తాడు. ఇప్పటి వరకు పరిచయం చేయని.. రమ్యకృష్ణ, జగపతి బాబు క్యారెక్టర్స్ ను ట్రైలర్ లో అద్భుతంగ ప్రెజెంట్ చేశారు. కొన్ని సన్నివేశాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ చూపించారు. డైలాగ్ చిన్నదిగా ఉంటుంది కానీ.. దాని ఇంపాక్ట్ మాత్రం చాలా పెద్దదిగా ఉండేలా జాగ్రత్త పడ్డారు. ప్రకాష్‌ రాజ్, అజయ్ ఘోష్ తదితరుల పాత్రలను కూడా పరిచయం చేశారు.

ఇప్పటి వరకు ఉన్న అంచనాలను ట్రైలర్ రెట్టింపు చేసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మాణ పరంగా ఏమాత్రం రాజీపడకుండా మంచి క్వాలిటీతో ఈ సినిమాను నిర్మించాయి. సంక్రాంతికి జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అయ్యింది. మహేష్ జంటగా ఫస్ట్ టైమ్ మీనాక్షి చౌదరి, శ్రీలీల నటించారు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అందరికీ నచ్చేలా త్రివిక్రమ్ ఈ సినిమాను తీశారనిపిస్తోంది. ఇక ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తూ రికార్డ్ వ్యూస్ తో దూసుకెళుతోంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనే నమ్మకాన్ని మేకర్స్ కి మాత్రమే కాదు.. ఆడియన్స్ కి కూడా కలిగించింది.

Also Read: AP : ఎమ్మెల్సీ ప‌ద‌వికి రాజీనామా చేసిన సి. రామ‌చంద్ర‌య్య‌.. జ‌గ‌న్ తో మ‌న‌సు విప్పి మాట్లాడే అవ‌కాశం..?

Exit mobile version