Guntur Kaaram Public Talk : మహేష్ ‘మాస్’ విస్ఫోటనం

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూసారు. వారి ఆసక్తి ఏమాత్రం తగ్గకుండా […]

Published By: HashtagU Telugu Desk
Gnktalk

Gnktalk

సూపర్ స్టార్ మహేష్ బాబు – త్రివిక్రమ్ (Mahesh – Trivikram) కలయికలో తెరకెక్కిన గుంటూరు కారం (Guntur Kaaram) మూవీ భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో మహేష్ – త్రివిక్రమ్ కలయికలో అతడు , ఖలేజా చిత్రాలు రాగా..ఈ రెండు ప్రేక్షకులను అలరించాయి. ఇక హ్యాట్రిక్ గా రాబోతున్న గుంటూరు కారం ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురుచూసారు. వారి ఆసక్తి ఏమాత్రం తగ్గకుండా సినిమాను వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేసారు. ఈ చిత్రంలోని సాంగ్స్ , టీజర్ , స్టిల్స్, ముఖ్యంగా ట్రైలర్ దుమ్ములేపడం తో సినిమా ఫై మరింత ఆసక్తి పెరిగింది. మరి మాటల మాంత్రికుడు ఏ మాయ చేసాడు..? మహేష్ ను ఎలా చూపించాడు…? సంక్రాంతి బరిలో అసలైన మొనగాడిని దింపడా..? అసలు కథ ఎలా ఉంది..? అనేది పబ్లిక్ టాక్ లో చూద్దాం.

We’re now on WhatsApp. Click to Join.

ఓవర్సీస్ లో ఇప్పటీకే షోస్ పూర్తి కావడం..తెలంగాణ లోను ఉదయం నాల్గు గంటల నుండే బెనిఫిట్ షోస్ మొదలు కావడం తో టాక్ ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. సినిమాలో సరికొత్త మహేష్ బాబు ను చూశామని..గతంలో ఎన్నడూ లేని విధంగా మహేష్ ఈ సినిమాలో అదరగొట్టాడని పంచ్ డైలాగ్స్ ,యాక్షన్ , డాన్స్ ఇలా ప్రతిదీ చించేసాడని చెప్పుకొస్తున్నారు. మాస్ ప్రేక్షకులు మెచ్చే, వాళ్లకు కావాల్సిన మసాలా అంశాలు ‘గుంటూరు కారం’లో పుష్కలంగా ఉన్నాయని తెలుపుతున్నారు. ఇక శ్రీ లీల గురించి..ఆమె డాన్స్ లు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, అసలు ఆమె ఎనర్జీ కి దండం పెట్టాలి సామీ అని అంటున్నారు. జగపతి బాబు , రావు రమేష్ , రమ్యకృష్ణ , ప్రకాష్ రాజ్ , జయరాం ఇలా ప్రతి ఒక్కరు చాల బాగా చేసారని..కాకపోతే కొన్ని చోట్ల బోరింగ్ సన్నివేశాలు , స్లో నేరేషన్ కాస్త ఇబ్బంది పెట్టాయని అంటున్నారు. అంతే తప్ప ఓవరాల్ గా సినిమా చాల బాగా వచ్చిందని అంటున్నారు. థమన్ మరోసారి చక్కనైన మ్యూజిక్ ఇచ్చారని..ముఖ్యంగా BGM అదరగొట్టాడని అంటున్నారు.

ఇక త్రివిక్రమ్ మరోసారి తన పెన్నుకు పదును పెట్టాడు..పంచ్ డైలాగ్స్ తో అబ్బా ఏమన్నా వేశాడా అనుకునేలా రాసాడు. అలాగే యాక్షన్ పార్ట్శ్ ఫై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాడు. అలాగే సెంటిమెంట్ తో కన్నీరు పెట్టేంచి ప్రయత్నం చేసాడు. ఓవరాల్ గా సంక్రాంతి బరిలో సరైన గుంటూరు ఘాటును రుచి చూపించాడు.

Read Also : Unique Auction of Fighter Rooster : పందెం కోడిని వేలానికి సిద్ధం చేసిన TSRTC

  Last Updated: 12 Jan 2024, 06:30 AM IST