Site icon HashtagU Telugu

మహేష్ బాబుకే ఎందుకు ఇలా జరుగుతుంది..?

Mahesh Gunt

Mahesh Gunt

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu)కు టైం ఏ మాత్రం కలిసి రావడం లేదు.. ఏం చేద్దాం అనుకున్నా.. ఏ పని మొదలు పెడదామనుకున్నా.. ఏ సినిమా షూటింగ్ స్టార్ట్ చేద్దామనుకున్నా..ఆఖరికి సినిమా తాలూకా ప్రమోషన్ లలో కూడా వరుసగా అవంతరాలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు కారం విషయంలో.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో గుంటూరు కారం (Guntur Kaaram) అనుకున్నప్పటి నుండి ఏదొక అవాంతరం అడ్డుపడుతుంది. సినిమా సెట్స్ పైకి వచ్చే క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ మరణం మహేష్ ను ఒంటరివాణ్ని చేసింది. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని షూటింగ్ మొదలుపెట్టారు..ఆలా మొదలుపెట్టారో లేదో హీరోయిన్ విషయంలో బ్రేక్ పడింది. ముందుగా అనుకున్న పూజా హగ్దే ప్లేస్ లో శ్రీ లీల వచ్చి చేరింది.

We’re now on WhatsApp. Click to Join.

కాస్త లేటుగా షూటింగ్ మొదలుపెట్టుకున్నప్పటికీ ఏదొక కారణంతో షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఎట్టకేలకు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకుని రిలీజ్ సిద్ధమైంది. జనవరి 14న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలో మేకర్స్ ప్రమోషన్ పై దృష్టి సారించారు. వరుసగా పాటలు విడుదల చేస్తుండగా..వీటిపై మిక్సెడ్ టాక్ వైరల్ అయ్యింది..పోనీ ప్రీ రిలీజ్ కార్యక్రమం తో అభిమానులను ఖుషి చేద్దామనుకొని మేకర్స్ ఈరోజు హైదరాబాదులోని యాసఫ్ గూడ పోలీస్ గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ (Guntur Kaaram Pre Release Event) ను ప్లాన్ చేయగా..చివరి నిమిషంలో పోలీసులు పర్మిషన్ రద్దు చేసి షాక్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ రద్దయిందనే విషయం తెలిసి అభిమానులు షాక్ కు గురయ్యారు. మార్ 24 గంటల్లో ఈవెంట్ జరగబోతుంది అనుకున్నప్పుడు ఇలా షాక్ ఇచ్చారు ఏంటని అభిమానులు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఈ ఈవెంట్ రద్దుకు కారణం బిగ్ బాస్ (Big Boss) గ్రాండ్ ఫినాలే అని తెలుస్తుంది. బిగ్ బాస్ ఫినాలే తరువాత పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక అభిమానుల గొడవ తారాస్థాయికి చేరుకోవడమే కాదు ప్రభుత్వ ఆస్తులతో పాటు సెలబ్రటీస్ కార్లు సైతం ధ్వసం అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. పల్లవి ప్రశాంత్ సహా పలువురు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది దృష్టిలో ఉంచుకుని పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా గుంటూరు కారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అనుమతి నిరాకరించినట్లు సమాచారం. గతంలో ఇలాంటివి జరగనప్పటికీ , ట్రాఫిక్ సమస్యలు , బందోబస్తు సమస్యలు వచ్చాయి. కానీ ఇప్పుడు అభిమానం పేరుతొ విధ్వసాలకు పాల్పడుతుండడం తో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి ఈరోజు గ్రాండ్ గా జరగాల్సిన ఈవెంట్ రద్దు కావడం తో అభిమానులు నిరాశలో ఉన్నారు. మరి రిలీజ్ కు వారం మాత్రమే సమయం ఉండడంతో ఈ లోపు ప్రీ రిలీజ్ చేస్తారా లేదా అనేది చూడాలి.

Read Also : Revanth Reddy Delhi Tour : నెలకు ఐదుసార్లు సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లాల్సిందేనా..?