Site icon HashtagU Telugu

Guntur Kaaram : OTT లో సందడి చేసేందుకు సిద్దమైన గుంటూరు కారం..

Guntur Kaaram First Review

Guntur Kaaram First Review

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh babu) నటించిన తాజా మూవీ గుంటూరు కారం (Guntur Kaaram) ..ఓటిటి (Netflix ) లో సందడి చేసేందుకు సిద్ధమైంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ – మహేష్ కలయికలో తెరకెక్కిన ఈ మూవీ భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా అభిమానుల అంచనాలను మాత్రం అందుకోలేక యావరేజ్ హిట్ అందుకుంది. అయినప్పటికీ మొదటి వారం లో భారీగా వసూళ్లు సాధించి సేఫ్ అయ్యింది.

ప్రస్తుతం థియేటర్స్ లో హిట్ అయినా , ప్లాప్ అయినా చిత్రాలైన సరే నెల తిరిగేలోపే ఓటిటి లోకి వచ్చేస్తున్నాయి. ముందే నిర్మాతలతో ఓటిటి సంస్థలు ఒప్పందం చేసుకొని భారీ ధరలకు రైట్స్ దక్కించుకుంటారు. ఈ తరుణంలో సినిమా రిలీజ్ అయినా నెల లోపే స్ట్రీమింగ్ చేస్తే వారికీ లాభం..నెల దాటినా తర్వాత స్ట్రీమింగ్ చేస్తే పెద్ద ఉపయోగం ఉండదు అందుకే పెద్ద హీరోల చిత్రాలైన , చిన్న హీరోల చిత్రాలైన సరే నెల లోపే స్ట్రీమింగ్ లో పెట్టేస్తారు. తాజాగా గుంటూరు కారం కూడా నెల లోపే ఓటిటి లో సందడి చేయబోతుంది.

We’re now on WhatsApp. Click to Join.

గుంటూరు కారం సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తాన్ని ముట్టజెప్పి దక్కించుకుంది. మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ డీల్ గా ఈ మూవీ నిలిచింది. అందుకే ఈ సినిమాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫిబ్రవరి 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేయాలనీ ఫిక్స్ అయ్యిందట. ఈ వార్త బయటకు రావడం తో అభిమానులు కాస్త నిరాశకు లోనవుతున్నారు. వారం రోజుల్లోనే 200 కోట్ల రూపాయలు వసూళ్లు చేసిన ఈ బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా నెల రోజుల్లోపే ఓటీటీలో స్ట్రీమింగ్ చేస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ చిత్రం కూడా ఇలాగే నెల రోజులు కూడా కాకముందే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓటిటిలో పెట్టేసారు. మహేష్ మూవీ కూడా అలాగే ఓటిటి లో పెట్టేయబోతున్నారు.

Read Also : Telangana: సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడు: దాసోజు