Guntur kaaram: 2024లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో గుంటూరు కారం ఒకటి. మహేష్ బాబు-శ్రీలీల నటించిన ఈ చిత్రం జనవరి 12, 2024న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన బజ్ చాలా ఎక్కువగా ఉంది. విడుదలకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉన్నప్పటికీ, ఈ చిత్రం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుంటూరు కారం సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు, శ్రీలీలలకు సంబంధించిన సన్నివేశాలను త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ సమయంతో పోటీ పడుతున్నారు. విడుదలకు ముందే షూట్ ముగించాలని ఒత్తిడి లో ఉన్నారు.. థమన్ సంగీతం అందించగా, మీనాక్షి చౌదరి సెకండ్ లీడ్‌గా కనిపించనుంది.
కాగా గుంటూరు కారం పాపులర్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫాం బుక్ మై షోలోగ గుంటూరు 100+ K ఇంట్రెస్ట్స్‌తో హెడ్‌లైన్స్‌లో నిలుస్తోంది. మహేశ్ బాబు క్రేజ్ రోజురోజుకి ఎలా పెరిగిపోతుందో చెప్పేందుకు మరోసారి అర్థం చేసుకోవచ్చు. గుంటూరు కారం నుంచి ఇప్పటికే లాంఛ్ చేసిన దమ్ మసాలా సాంగ్, ఓ మై బేబి లిరికల్ వీడియో సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నాయి.