Site icon HashtagU Telugu

Guntur Kaaram: ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే పండుగ సినిమా గుంటూరు కారం

Mahesh Babu Guntur Karam Another Song Surprise

Mahesh Babu Guntur Karam Another Song Surprise

Guntur Kaaram: ఈ సంక్రాంతికి అనేక సినిమాలు విడుదలయ్యాయి. అందులో భారీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇటీవల విడుదలైన గుంటూరు కారం మూవీకి మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. మహేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మించిన మూవీ ‘గుంటూరు కారం’ .సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలైన ఈ చిత్రం తొలి రోజున రూ.94 కోట్ల వసూళ్లను సాధించింది రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్బంగా చిత్ర మేకర్స్ మీడియాతో మాట్లాడారు. నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ ‘గుంటూరు కారం’ సినిమా సంక్రాంతికి జనవరి 12న రిలీజైందని,  మేం ఊహించిన దాని కంటే గొప్ప రెస్పాన్స్ రావటం చాలా సంతోషంగా ఉంది. కలెక్షన్స్ చాలా బాగా వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఉన్న సినిమా రీజనల్ తెలుగు సినిమా వచ్చిందని అన్నారు.

‘‘ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని చోట్ల మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ఈవినింగ్ షోస్ కంతా ఆ టాక్ అంతా సమసిపోయింది. చక్కగా ఫ్యామిలీ అంతా ఎంజాయ్ చేసే పండుగ సినిమా. కుటుంబంతో వచ్చి మహేష్, త్రివిక్రమ్ గారి సినిమాను ఎంజాయ్ చేయండి. పాటలు, ఫైట్స్, సెంటిమెంట్ సహా అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఫెస్టివల్ మూవీ. అందరూ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతారనే గ్యారంటీ మాది. ఎలాంటి నెగిటివ్ రివ్యూలు నమ్మవద్దని ఆయన అన్నారు.

ఇక దిల్ రాజు మాట్లాడుతూ ‘మహేష్ బాబుగారి క్యారెక్టర్ ను బేస్ చేసుకుని చేసిన సినిమా ‘గుంటూరు కారం’. తల్లీ, కొడుకు మధ్య ఉండే ఫ్యామిలీ ఎమోషనల్ మూవీ. కుటుంబం అంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. క్లైమాక్స్ లో వచ్చే ఎమోషన్. చివరలో వచ్చే మాస్ సాంగ్ ఇలా అన్నింటిని ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. పండుగ తర్వాత సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది తెలుస్తోంది. మరో నాలుగు రోజులు పండుగ ఉంటుంది. బాగుండే సినిమాను ఎవరూ ఆపలేరు. అది చరిత్ర అని అన్నారాయన.