Site icon HashtagU Telugu

Guntur Kaaram Collections: గుంటూరు కారం కలెక్షన్స్ లో నిజమెంత?

Guntur Kaaram Collections

Guntur Kaaram Collections

Guntur Kaaram Collections: టాలీవుడ్ స్టార్ హీరో ఘట్టమనేని మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన చిత్రం గుంటూరు కారం. ఈ చిత్రం సంక్రాంతికి విడుదలై మిక్స్డ్ టాక్ తో రన్ అవుతుంది. భారీ అంచనాలతో విడుదలైనప్పటికీ తొలి రోజే యావరేజ్ టాక్ రావడంతో అభిమానులు నిరాశ చెందారు. ఇక మిడ్ నైట్ షోల నుంచి ఈ మూవీకి ప్లాప్ టాక్ వచ్చింది. మహేష్ బాబు సినిమాకు ప్లస్.. త్రివిక్రమ్ మైనస్.. అంటూ సినీ పండితులే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా అన్నారంటే.. టాక్ ఎంత నెగిటివ్ గా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. దీంతో గుంటూరు కారం ఫ్లాప్ అంటూ వార్తలు వచ్చాయి.

అయితే.. ఇంత నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ.. కలెక్షన్స్ మాత్రం సూపర్ అనేలా వచ్చాయి. 212 కోట్లు కలెక్ట్ చేసి.. రీజినల్ మూవీస్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా గుంటూరు కారం నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాత నాగవంశీ మీడియా మీట్ ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్ లో నాగవంశీ మాట్లాడుతూ.. సినిమా ఫ్యామిలీ స్టోరీ కానీ.. గుంటూరు కారం అనేసరికి మాస్ మూవీ అనుకుని థియేటర్లకు వచ్చిన జనాలకు అంతగా నచ్చుండకపోవచ్చు. అయితే.. ఎప్పుడైతే ఫ్యామిలీ ఆడియన్స్ చూడడం స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కలెక్షన్స్ పెరిగాయి అని చెప్పారు నాగవంశీ.

అయితే.. ఈ సినిమాకు ఇంత కలెక్షన్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు కానీ.. అవన్నీ ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి అని అడిగితే.. తన సినిమాకు ఫేక్ కలెక్షన్స్.. మిగతా సినిమాలకు ఓరిజినల్ కలెక్షన్సా..? ఇది ఎలా తెలుసు అని ప్రశ్నించారు. అంతే కాకుండా.. ఫేక్ కలెక్షన్స్ అని చెప్పడం కాదు.. మీరన్నదే నిజం అయితే.. ఫ్రూవ్ చేయాలన్నారు. ఈ విధంగా గుంటూరు కారం కలెక్షన్స్ ఫేక్ కాదు.. ఓరిజినల్ కలెక్షన్స్ అని క్లారిటీ ఇచ్చారు నాగవంశీ. గుంటూరు కారం ఇప్పటికీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరి.. ఫుల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Also Read: Peacocks Dead: రాజస్థాన్‌లో 50 నెమళ్లు మృతి

Exit mobile version