Guna Sekhar : మన తెలుగు హీరోలు అలా చేయరు.. బాలీవుడ్ హీరోలని పొగిడిన డైరెక్టర్..

తాజాగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

Published By: HashtagU Telugu Desk
Guna Sekhar sensational comments on Tollywood Heros

Gunasekhar

Guna Sekhar :  చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రమదేవి.. లాంటి పలు సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ గుణశేఖర్ ప్రస్తుతం శాకుంతలం సినిమాతో రాబోతున్నాడు. పురాణాల్లోని దుశ్యంతుడు-శాకుంతల కథని ఆధారంగా తీసుకొని సమంత మెయిన్ లీడ్ లో శాకుంతలం అనే సినిమాని తెరకెక్కించాడు. శాకుంతలం సినిమా ఏప్రిల్ 14న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాకు గుణశేఖర్ కూతురు నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరించింది. గత కొద్ది రోజులుగా చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. తాజాగా చిత్ర దర్శకుడు గుణశేఖర్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

గుణశేఖర్ ఓ ఇంటర్వ్యూలో సినిమాల్లోని గెస్ట్ పాత్రల గురించి మాట్లాడుతూ.. అమితాబ్, సల్మాన్, షారుఖ్, అమీర్.. ఇలా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ గెస్ట్ పాత్రలు చేస్తారు. పలు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు వీళ్ళు. కానీ మన తెలుగు హీరోలు అలా చేయరు. అంత తొందరగా తెలుగు స్టార్ హీరోలు గెస్ట్ అప్పీరెన్స్ లు ఇవ్వరు. ఈ విషయంలో తెలుగు హీరోలు మారాలి. రుద్రమదేవి సినిమాలో చాలా మందిని అడిగినా చేయలేదు. చివరికి అల్లు అర్జున్ చేశాడు ఆ అతిధి పాత్రను. శాకుంతలం సినిమాలో దుశ్యంతుడు పాత్రలో చాలా కోణాలు ఉంటాయి. హీరోయిన్ కంటే చిన్న పాత్ర, అలాంటప్పుడు మన తెలుగు హీరోలు చేయరు. అందుకే అడిగి నో చెప్పించుకునే బదులు నేనే మలయాళం నుంచి దేవ్ మోహన్ ని తెచ్చుకొని అతనికి నేర్పించుకున్నాను అని అన్నారు. దీంతో గుణశేఖర్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ లో వైరల్ గా మారాయి.

 

Also Read :    Manchu Manoj : రెండో భార్యని తీసుకొని టీవీ షోకి వచ్చిన మంచు మనోజ్.. ఎన్ని సీక్రెట్స్ చెప్పారో తెలుసా?

  Last Updated: 13 Apr 2023, 07:54 PM IST