Site icon HashtagU Telugu

Prachi Thakur : టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కున్నాను.. గుజరాతీ భామ వ్యాఖ్యలు..

Gujarathi Actress Prachi Thakur Spoke about Casting Couch in Tollywood

Gujarathi Actress Prachi Thakur Spoke about Casting Couch in Tollywood

గుజరాతీ మోడల్ ప్రాచీ ఠాకూర్(Prachi Thakur) ఇటీవల రాజుగారి కోడి పులావ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రాచీ చదువుకునేటప్పుడే మోడలింగ్ కూడా చేసేది. అదే సమయంలో కళ్యాణ్ రామ్(Kalyan Ram) పటాస్(Pataas) సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో ప్రాచీ మూగ అమ్మాయిగా, కళ్యాణ్ రామ్ చెల్లెలిగా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించింది. ఆ తర్వాత లవ్ యు టూ అనే ఓ సినిమా, ఓ సిరీస్ లో కూడా నటించింది.

అయితే తాజాగా రాజుగారి కోడి పులావ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రాచీ ఠాకూర్ టాలీవుడ్ లో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని తెలిపింది.

ప్రాచీ ఠాకూర్ మాట్లాడుతూ.. పటాస్ సినిమా తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్ళు నన్ను సంప్రదించి ఒక యాడ్ చేయమని అడిగారు. నేను ఓకే చెప్పాను. నాకు భాష రాకపోవడంతో ఓ తెలుగు అబ్బాయిని మీడియేటర్ గా పెట్టుకున్నాను. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. అయితే షూట్ కి ముందు కమిట్మెంట్ కి నువ్వు రెడీనే కదా అని అడిగాడు. నువ్వు డేట్ చెప్పు, నేను కచ్చితంగా షూట్ కి వస్తాను అన్నాను. అతను మళ్ళీ మళ్ళీ కమిట్మెంట్ అని అడిగాడు. అర్ధం అవ్వలేదు అంటే ఇంకో రెండు లక్షలు ఇస్తారు కాంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. నేను ఆ డీటెయిల్స్ అన్ని మా ఫ్రెండ్ ఒక అమ్మాయికి చెప్తే అప్పుడు తను కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పింది. అది అర్థమయ్యాక నేను చాలా బాధపడ్డాను. ఆ యాడ్ కూడా చేయను అని చెప్పి అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశాను అని తెలిపింది ప్రాచీ ఠాకూర్. దీంతో గుజరాతీ భామ ప్రాచీ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

 

Also Read : Nagarjuna : అమల కడుపుతో ఉన్నప్పుడు ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉన్నాను.. ఎమోషనల్ అయిన నాగార్జున..