Tollywood: రొమాంటిక్ మూడ్ లో దిశా పఠాని, ప్రభాస్.. నెట్టింట ఫోటోస్ వైరల్?

తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవలె సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ టీం మొత్తం ఇటలీలో ల్యాండ్ […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 08 Mar 2024 08 19 Am 6004

Mixcollage 08 Mar 2024 08 19 Am 6004

తెలుగు సినిమా ప్రేక్షకులకు టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం వరసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇటీవలె సలార్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్ ప్రస్తుతం తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ టీం మొత్తం ఇటలీలో ల్యాండ్ అయ్యింది. ఇందుకు సంబంధించిన ఫోటోను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇటలీలోని అందమైన లోకేషన్ లలో ఒక సాంగ్ ప్లాన్ చేశారని, అది కూడా ప్రభాస్, దిశా మధ్య ఉండనుందని సమాచారం.

ఇటీవలే ఈ సాంగ్ షూట్ కంప్లీట్ చేసుకుని ఢిల్లీ చేరుకుంది మూవీ టీం. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక ఫోటోను షేర్ చేసింది. విమానంలో ప్రభాస్ ను ఫోటో తీస్తూ కనిపించింది దిశా. కాగా దిశా ఫోటో తీస్తుండగా ప్రభాస్ ఆమె వైపు చూస్తూ చిరునవ్వులు చిందించారు. రొమాంటిక్ మూడ్ లో ఉన్నట్టుగా కూడా కనిపించారు. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది. నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

 

ఇందులో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, దిశా పటానీ, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో మార్చి 9న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. దాదాపు 6000 సంవత్సరాల వెనుక కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మరి ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి మరి.

  Last Updated: 08 Mar 2024, 08:21 AM IST